హైదరాబాద్‎లోని ఐకియా మాల్‎కు కన్స్యూమర్ ఫోరం జరిమానా.. అసలు కారణం ఇదే..

పేపర్ క్యారీ బ్యాగ్‌కు చార్జీలు వసూలు చేయడంతో బాధ కలిగించిన స్థానిక నివాసికి రంగారెడ్డి జిల్లా వినియోగదారీ ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై కన్స్యూమర్ ఫోరం కమిషన్ హైదరాబాద్‌లోని ఐకియాను రూ. 1000 నష్టపరిహారం వినియోగదారునికి చెల్లించాలంటూ ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన వినియోగదారు జూన్ 2021లో ఐకియా నుండి రూ. 816 విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. అయినప్పటికీ క్యారీ బ్యాగ్‌ను అందించలేదు.

హైదరాబాద్‎లోని ఐకియా మాల్‎కు కన్స్యూమర్ ఫోరం జరిమానా.. అసలు కారణం ఇదే..
Ikea Mall
Follow us

|

Updated on: Apr 22, 2024 | 12:57 PM

పేపర్ క్యారీ బ్యాగ్‌కు చార్జీలు వసూలు చేయడంతో బాధ కలిగించిన స్థానిక నివాసికి రంగారెడ్డి జిల్లా వినియోగదారీ ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై కన్స్యూమర్ ఫోరం కమిషన్ హైదరాబాద్‌లోని ఐకియాను రూ. 1000 నష్టపరిహారం వినియోగదారునికి చెల్లించాలంటూ ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన వినియోగదారు జూన్ 2021లో ఐకియా నుండి రూ. 816 విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. అయినప్పటికీ క్యారీ బ్యాగ్‌ను అందించలేదు. దీంతో గద్యంతరం లేక ఐకియా లోగో ముద్రించిన బ్యాగ్‌ను రూ. 20 పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో అతనికి ఎదురైన అన్యాయం వేరొకరికి జరగకూడదని, ఇలాంటి ఒత్తిడి వేరొకరికి ఐకియా సంస్థ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఈ అన్యాయంపై వినియోగదారీ ఫోరంను ఆశ్రయించారు. తనకు ఎదురైన అన్యాయంపై మాట్లాడుతూ పెద్ద పేరొందిన సంస్థ కస్టమర్లను కవర్ల పేరుతో నిలువునా దోపిడీకి గురి చేస్తున్నారని కోర్టులో వాదించాడు.

దీనికి కౌంటర్‎గా ఐకియా తన వాదనలను వినిపించింది. క్యారీ బ్యాగ్‌లను కొనుగోలు చేయమని వినియోగదారులను బలవంతం చేయలేదని తమ సొంత బ్యాగులను క్యారీ చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఐకియా పేర్కొంది. అయితే, ఐకియా లోగోను ముద్రించి ఉన్న బ్యాగులను తీసుకువెళ్లినందుకు ఛార్జ్ చేయడాన్ని కమిషన్ తప్పుబట్టింది. దీనికి వాణిజ్యపరమైన అనుమతి లేదని కమిషన్ పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ కమిషన్‌కు చెందిన వినియోగదారుల న్యాయ సహాయ ఖాతాలో రూ.5,000 డిపాజిట్ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 8 నుండి 45 రోజులలోపు అన్ని ఆర్డర్‌లను తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో రూ. 5,000పై సంవత్సరానికి 24% వడ్డీ రేటు విధించబడుతుందని కమిషన్ పేర్కొంది. వ్యాపారాలు వినియోగదారుల రక్షణ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని తెలిపింది.

ఇలాంటి సంఘటనే గతంలో స్పెన్సార్స్ సూపర్ మార్కెట్లో కూడా చోటు చేసుకుంది. ఒక వినియోగదారుడు కూల్ డ్రింక్, చాక్లెట్స్ తీసుకుని బిల్లింగ్ చేయించాడు. ఆ సమయంలో క్యారీబ్యాగ్ కు సంబంధించి రూ.5 చార్జ్ చేసినట్లు తన బిల్లింగ్‎లో చూపించారు. దీనిపై కన్స్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ ఘటన చోటు చేసుకుని చాలా ఏళ్లు అయినప్పటికీ 2022 సంవత్సరంలో న్యాయం జరిగింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన శ్యామ్ కుమార్ తనకు ఇచ్చిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ ఇరువైపులా స్పెన్సాన్స్ సూపర్ మార్కెట్ పేరును ముద్రించడాన్ని ఖండించాడు. వ్యాపార సంస్థలు వారి పబ్లిసిటీ ప్రయోజనాల కోసం కస్టమర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కావాలంటే తమ పేరును ముద్రించి ఉచితంగా క్యారీ బ్యాగులను అందించాలని సూచించారు. దీనిపై స్పందించిన వినియోగదారి కమిషన్ స్పెన్సార్స్ సూపర్ మార్కెట్ చేసిన చర్యలపై వేటు వేసింది. జరిమానా కూడా విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?