Hyderabad: మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. మద్యం షాపులు బంద్‌.. కారణం ఏంటంటే

చాలా మందికి మద్యం లేనిదే రోజు గడవదు. కొందరు ఉదయం నుంచే మొదలు పెడుతుంటే మరి కొందరు రాత్రి కాగానే వైన్స్‌ షాపులకు దారి పట్టాల్సిందే. ముందు సమ్మర్‌ సీజన్‌ బీర్లకు భలే గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు షాకింగ్‌ వార్త ఒకటుంది. హైదరాబాద్‌లో మంగళవారం మద్యం దుకాణాలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..

Hyderabad: మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. మద్యం షాపులు బంద్‌.. కారణం ఏంటంటే
Liquor Shops
Follow us

|

Updated on: Apr 22, 2024 | 4:52 PM

చాలా మందికి మద్యం లేనిదే రోజు గడవదు. కొందరు ఉదయం నుంచే మొదలు పెడుతుంటే మరి కొందరు రాత్రి కాగానే వైన్స్‌ షాపులకు దారి పట్టాల్సిందే. ముందు సమ్మర్‌ సీజన్‌ బీర్లకు భలే గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు షాకింగ్‌ వార్త ఒకటుంది. హైదరాబాద్‌లో మంగళవారం మద్యం దుకాణాలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లో మద్యం దుకాణాలు మంగళవారం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

హనుమాన్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 23న నగరంలో మద్యం షాపులు మూసి ఉండనున్నాయని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్‌ షాపులు మూసి ఉండనున్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి షాపులను తెరిచినట్లయితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా, హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ఎత్తున శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో ఈ వారంలో మద్యం షాపులు మూసి వేయడం రెండో సారి. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా నగరంలో వైన్స్‌ షాపులు మూసి ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు బంద్ చేయనుండడంతో మద్యం ప్రియులకు వారంలోనే రెండు సార్లు షాక్ తగిలినట్టైంది. అలాగే గత ఆదివారం మాంసం దుకాణాలు కూడా మూసేసిన సంగతి తెలిసిందే. జైన మత ప్రచారకుడు మహావీర్‌ జయంతి నేపథ్యంలో చికెన్, మటన్ దుకాణాలు మూసేస్తూ జీహెచ్‌ఎంసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

Liquor Shops 1

Liquor Shops 1

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి