AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బాబోయ్.. హోటల్‌కి వెళ్లి సాంబార్ రైస్ ఆర్డర్ పెడితే.. ఇది సీన్..

చట్టంతో మీ తాట తీస్తాం అంటూ ఓవైపు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కొరడాపట్టుకుని వాతలు పెడుతున్నా...బరితెగించిన కొన్ని రెస్టారెంట్లు కంపుకొట్టే ఆహారాన్నే మనముందు వేడివేడిగా వడ్డిస్తున్నాయి. ఒకవైపు వరుస తనిఖీలతో హోటల్స్‌.. రెస్టారెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు నిర్వహికులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. సీజ్‌ చేస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రెస్టారెంట్లు, హోటల్స్‌ తీరు ఏమాత్రం మారడంలేదు.

Hyderabad: బాబోయ్.. హోటల్‌కి వెళ్లి సాంబార్ రైస్ ఆర్డర్ పెడితే.. ఇది సీన్..
Cockroach found in sambar rice
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 16, 2025 | 5:41 PM

Share

హైదరాబాద్‌లో బయట ఏం తినే పరిస్థితి లేకుండా పోయింది. వంటశాలల్లో కనీస పరిశుభ్రత పాటించడం లేదు. ఇక వంటల్లో వాడే సరుకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకే హోం ఫుడ్.. బెస్ట్ ఫుడ్ అని పదే, పదే చెబుతున్నారు డాక్టర్లు. హైదరాబాద్ హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఇటీవల ఎన్నో ఘోరాలు చూశారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడాలు ఝులిపిస్తూనే ఉన్నారు. అయినా కొందరు మారడం లేదు. తాజాగా.. ఓ వ్యక్తికి హోటల్లో వడ్డించిన సాంబార్‌ రైస్‌లో బొద్దింక దర్శనమివ్వడంతో కంగుతిన్నాడు. దీంతో సదరు కస్టమర్‌‌కు కడపులో దేవినట్లు అనిపించింది. వెంటనే అధికారులకు కంప్లైంట్ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉన్న మినర్వా హోటల్‌‌కు హైదరాబాద్‌కు చెందిన రాణా అనే కస్టమర్ వెళ్లాడు. అక్కడ సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టగా.. అక్కడి సిబ్బంది వడ్డించిన ఆ డిష్‌లో బొద్దింక కనిపించిడంతో.. షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడి హోటల్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును అత్యవసరంగా విచారించి, సదరు హోటల్ ఆహార భద్రతా ప్రమాణాలు పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అధికారులకు విన్నవించాడు. ప్రజారోగ్యం ముప్పులో ఉన్నందుకున దయచేసి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఇప్పటికే సిటీలోని పలు ప్రముఖ హోటళ్లపై తనిఖీలు నిర్వహించి లోపాలు ఉంటే బెండు తీస్తోన్న అధికారులు.. ఈ హోటల్‌ నిర్వాకంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మీకు మరీ.. మరీ చెప్తున్నాం.. నాలుగు కాలాల పాటు రోగాలు లేకుండా బతకాలంటే బయట ఫుడ్ మానెయ్యండి..

వీడియో దిగువన చూడండి..