Revanth Reddy: ఒక్క వాయిదా కూడా లేకుండా అసెంబ్లీలో బిల్లులన్నీ పాస్.. సీఎం రేవంత్ సూపర్ హ్యాపీ.. వీడియో
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సభలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ పాస్ అయ్యాయి. కానీ అసెంబ్లీ ఒక్కసారి కూడా వాయిదా పడలేదు. వాయిదాల పర్వం లేని అసెంబ్లీ సమావేశాలను మీరూ చూసేయండి...
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సభలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ పాస్ అయ్యాయి. కానీ అసెంబ్లీ ఒక్కసారి కూడా వాయిదా పడలేదు. వాయిదాల పర్వం లేని అసెంబ్లీ సమావేశాలను మీరు చూస్తే ఫిదా అవుతారు.. ఇది అసెంబ్లీ సమావేశమే కానీ మాక్ అసెంబ్లీ.. చిల్డ్రన్ డే సందర్భంగా హైదరాబాద్ NCERTలో అండర్ 18 మాక్ అసెంబ్లీ జరిగింది. ఈ సమావేశాల్లో విద్యార్థులు దుమ్ములేపారు. నేటి విద్యార్థులే రేపటి ప్రజాప్రతినిధులన్నట్టు డైలాగులు దంచికొట్టారు. అధికారంలో ఉన్నవాళ్లు దర్పం చూపెట్టడానికి యత్నిస్తే.. విపక్షంలో ఉన్నవాళ్లు డైలాగులతో రివర్స్ ఎటాక్ చేశారు.
వీళ్లంతా విద్యార్థులే.. కానీ స్పీచ్‌లో బేస్ ఉంది. పంచ్‌లో పవర్ ఉంది. ప్రసంగంలో పస ఉంది. పిల్లల సభ కాస్త సరదాగా.. కాస్త సీరియస్‌గా సాగింది. మాస్, క్లాస్ డైలాగ్స్ కలిపికొట్టారు విద్యార్థులు. స్పీకర్ చైర్‌లో కూర్చున్న విద్యార్థి కూడా ఎంతో హుందాగా మాట్లాడారు.
వీడియో చూడండి..
ఫిదా అయిన సీఎం రేవంత్ రెడ్డి..
ఈ మాక్ అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభ జరిగిన తీరు చూసి మురిసి పోయారు. విద్యార్థుల అసెంబ్లీ సమావేశాలు చూసి తాను ఫిదా అయ్యానన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదా లేకుండా సాగాలని ఆకాంక్షించారు.
దేశంలో చట్ట సభలకు పోటీ చేయడానికి వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం చేసి దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోరారు. వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించడం వల్ల యువత చట్ట సభల్లోకి రావడానికి… pic.twitter.com/DcMmjMdsGu
— Telangana CMO (@TelanganaCMO) November 14, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..