CM Revanth Reddy: హైదరాబాద్ పోలీసులకు అరుదైన గౌరవం.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి!
మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్’ కేటగిరీలో మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినంధించారు.

మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈ రోజు తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలన్నది నా ఆకాంక్ష.. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం నేను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు నేను మద్దతుగా ఉంటాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
వివిధ రంగాల్లో… ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష.
మాదకద్రవ్యాల నియంత్రణలో… 138 దేశాలతో పోటీ పడి…ఈ రోజు తెలంగాణ పోలీస్… ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది.
ఈ ఘనతను సాధించిన… హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ… pic.twitter.com/CLKSzX75jc
— Revanth Reddy (@revanth_anumula) May 17, 2025
తెలంగాణ పోలీసులను అరుదైన గౌరవం వరించింది. మాదకద్రవ్యాల నివారణకు వారు చేస్తున్న కృషికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో నిర్వహించిన పోటీలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ తొలి స్థానం కైవసం చేసుకుది. ఈ మేరకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్( హెచ్ ఎన్‌ఈడబ్ల్యూ) చీఫ్ సీవీ ఆనంద్ శుక్రవారం ‘ఎక్సలెన్స్ ఇన్ యాంటీ- నార్కోటిక్స్’ అవార్టు అందుకున్నారు. దుబాయ్ ప్రభుత్వం నిర్వహించిన ‘వరల్డ్ పోలీస్ సమిట్’ 2025లో భాగంగా శుక్రవారం అవార్డులు ప్రదానం చేసింది. ఈ సమిట్‌లో 138 దేశాల నుంచి ఆయా పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
