ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యలకు చెక్..
కారు పార్కింగ్‌లోనే ‘సిటీ సైడ్ సెల్ఫ్ చెక్ ఇన్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు కారు పార్కింగ్‌లోనే బ్యాగేజ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. అక్కడే బ్యాగేజీ తనిఖీలతో పాటు, బోర్డింగ్ పాసులను సైతం తీసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో లగేజ్‌తో ప్రయాణం చేసే వారికి సమయం ఆదా అవుతుంది. ఫైట్ బయలు దేరే ఆరు గంటల ముందు నుంచి ఈ సౌకర్యాన్ని పొందొచ్చు...

విమాన ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో.. బ్యాగేజ్ చెక్ ఇన్, సెక్యూరిటీలో అంత ఇబ్బందిగా ఉంటాయి. ఫ్లైట్ జర్నీ సమయానికి ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో భారీ క్యూలైన్‌లో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌పట్టడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కారు పార్కింగ్‌లోనే ‘సిటీ సైడ్ సెల్ఫ్ చెక్ ఇన్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు కారు పార్కింగ్‌లోనే బ్యాగేజ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. అక్కడే బ్యాగేజీ తనిఖీలతో పాటు, బోర్డింగ్ పాసులను సైతం తీసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో లగేజ్‌తో ప్రయాణం చేసే వారికి సమయం ఆదా అవుతుంది. ఫైట్ బయలు దేరే ఆరు గంటల ముందు నుంచి ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. కొత్త ఏడాది తొలి రోజు నుంచి (జనవరి 1వ తేదీ) ఈ సేవలను అమల్లోకి తీసుకొచ్చారు.
ఈ సదుపాయంతో ఇకపై ప్రయాణికులు విమానయాన సంస్థలు ఏర్పాటు చేసే లగేజ్ డ్రాప్ కౌంటర్ల దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. ఈ సేవలతో ఎయిర్ పోర్ట్ లోపల కౌంటర్లలో రద్దీ తగ్గుతుంది. సెల్ఫ్ చెక్ ఇన్ ద్వారా ట్యాగులు పొందే వీలుంది. వాటితో లగేజ్ ను పంపే వీలుంది. కొత్తగా ఏర్పాటు చేసిన కియోస్క్ ల ద్వారా సెల్ఫ్ చెక్ ఇన్ కు వీలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణ వివరాలు చెక్ చేసుకొని చెక్ ఇన్ కావొచ్చు.
అనంతరం క్షణాల్లోనే మీ మొబైల్‌కు బోర్డింగ్ పాస్‌లు వస్తాయి. అలాగే బ్యాగేజీ ట్యాగర్లూ వచ్చేస్తాయి. దీని తర్వాత ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ వద్దకు వెళ్లి కన్వేయర్ బెల్ట్‌పై సామగ్రి పెడితే అది ప్రాసెస్ అవుతుంది. బ్యాగులకు ట్యాగులు ప్రయాణికులే వేయాల్సి ఉంటుంది. అనంతరం, ప్రయాణికులకు అధికారులు రసీదు జారీ చేశాక సంబంధిత ఎయిర్ లైన్స్‌కు ధ్రువీకరణ సందేశం వెళుతుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..