Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన మహిళా ప్రయాణికులు.. అధికారులు కీలక నిర్ణయం.
సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 9 నుంచి 10 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణించగా, ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఈ సంఖ్య ఏకంగా 18 లక్షలకు చేరింది. వీరిలో అధికులు మహిళలే కావడం విశేషం. గతంలో ప్రతిరోజూ 4.5 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా ఇప్పుడు ఏకంగా 10 లక్షల మంది మహిళలు సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన నాటి..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రయాణికులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రభావం హైదరాబాద్‌లోనూ పడింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం తర్వాత హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగినట్లు గణంకాలు చెబుతున్నారు.
సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 9 నుంచి 10 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణించగా, ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఈ సంఖ్య ఏకంగా 18 లక్షలకు చేరింది. వీరిలో అధికులు మహిళలే కావడం విశేషం. గతంలో ప్రతిరోజూ 4.5 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా ఇప్పుడు ఏకంగా 10 లక్షల మంది మహిళలు సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2.50 కోట్ల మంది మహిళా ప్రయాణికులు సిటీ బస్సుల్లో ప్రయాణించారు. ఇలా ప్రయాణికు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.
పెరుగుతోన్న రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుంత నగరంలో మొత్తం 2850 బస్సులు అందుబాటులో ఉండగా, అదనంగా 1100ల బస్సులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత 880 బస్సులను వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. వీటిలో 540 బస్సులు టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కాగా.. మరో 340 బస్సులు అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవడానికి టెండర్లను ఆహ్వానించారు.
ఇలా జులై నాటికి కొత్తగా మొత్తం 880 బస్సులు సమకూరుతాయని అధికారులు చెబుతున్నారు. రెంట్ బస్సులు తక్కువైతే సొంతంగా బస్సులను సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రతీ ఏటా కాలం చెల్లిన సుమారు 200 బస్సులను తొలగిస్తున్నారు. దీంతో సిటీలో బస్సుల కొరత ఏర్పడకూడదనే ఉద్దేశంతో జిల్లాలకు చెందిన నగరాలకు తీసుకొచ్చి వాటిని ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులుగా మార్చుతున్నారు. ఈ బస్సులకు అదనంగా 880 బస్సులు అందుబాటులోకి వస్తే నగర అవసరాలు తీరుతాయని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..