Chicha Charles: హైదరాబాద్‌ పోలీసుల అదుపులో చిచ్చా చార్లెస్.. రీజన్ ఇదే

హైదరాబాద్‌లో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

Chicha Charles: హైదరాబాద్‌ పోలీసుల అదుపులో చిచ్చా చార్లెస్.. రీజన్ ఇదే
Chicha Charles
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 02, 2021 | 8:58 AM

హైదరాబాద్‌లో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న విదేశీయులే టార్గెట్‌గా 40 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వీసా గడువు ముగిసిన ఉంటున్న 25 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నవారిలో జబర్దస్త్‌ చార్లెస్‌ చిచ్చా కూడా ఉన్నాడు. ఈయన వీసా గడువు ముగిసి రెండేళ్లు అవుతోంది. పాపులర్ హిట్ సాంగ్స్‌ను తెలుగులో పాడి చిచ్చా చార్లెస్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత జబర్దస్త్ సహా పలు షోలలో కనిపించాడు. వచ్చీ రానీ తెలుగుతో ఇతడు మాట్లాడే మాటలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. ఇతడు యుగాండా దేశస్థుడిగా  తెలిసింది. చదువుకునేందుకు వరంగల్ వచ్చాడు. అలా తన పాటలతో అందరికీ కనెక్టయి.. పాపులారిటీ తెచ్చుకున్నాడు.

ఆఫ్రికా, సోమాలియా, కాంగో, నైజీరియా, యుగాండా దేశస్తులు చాలా మంది వీసా గడువు ముగిసిన ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. దీంతో పోలీసులు వీరిపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర