Coronavirus: ట్యాంక్‌బండ్‌పై జరిగే సండే – ఫన్‌డేను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కారణమేంటో తెలుసా..?
Coronavirus: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇటీవలి కాలంలో కాస్త శాతించిందని అందరూ సంతోష పడ్డారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడం, కరోనా కేసులు భారీగా తగ్గుముకం...
Coronavirus: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇటీవలి కాలంలో కాస్త శాతించిందని అందరూ సంతోష పడ్డారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడం, కరోనా కేసులు భారీగా తగ్గుముకం పడుతుండడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక టెన్షన్ ఏం లేదు అనుకుంటోన్న సమయంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిందని వార్తలు వస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ యావత్ ప్రపంచాన్ని మరోసారి గడలెత్తిస్తోంది. ఇప్పటికే 20కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ వెలుగులోకి రావడంతో అందరూ భయపడే పరిస్థితుల వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. తమ దేశంలోకి ఈ కొత్త వేరియంట్‌ను రానివ్వకుండా అడ్డుకునేందుకు చర్యలకు పూనుకున్నాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ భారత్ కూడా పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇది వరకే తెలిపారు. ఇక ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేశారు. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉండడంతో జనాలను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగానే ట్యాంక్‌బండ్‌పై జరిగే సండే– ఫన్‌డేను రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు. ఈ లెక్కన డిసెంబర్ 5న ట్యాంక్ బండ్‌పై సండే – షన్‌డే ఉండబోదన్నమాట. దీంతో ఈ ఆదివారం ట్యాండ్‌బండ్‌పై వాహనదారులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని అర్వింద్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
In view of the uncertainties regarding #Omicron coronavirus variant & as a matter of abundant precaution, the Sunday-Funday event shall not be held this Sunday ie Dec 5.
However, the tank bund will be vehicle-free as usual on Sunday @TSMAUDOnline
— Arvind Kumar (@arvindkumar_ias) December 1, 2021
Bangarraju: బంగార్రాజు మూవీ నుంచి త్వరలో అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న సాంగ్ టీజర్..