Smoking: విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడి అరెస్టు
Smoking: అది మరువకముందే మారోగటన చోటు చేసుకుంది. టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ అనే వ్యక్తి ఆదివారం శంషాబాద్ నుంచి ఇండిగో
విమానంలో ధూమపానం అనేది అవినీతికి, ప్రమాదానికి దారితీసే చర్యగా పరిగణించబడుతుంది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో ధూమపానం చేసిన ప్రయాణికులపై బలమైన నిబంధనలు ఉన్నాయి. అయినా గాని ఎక్కడో ఒక దగ్గర విమానా ప్రయాణం చేస్తూ పట్టుబడిన వీడియోలు అరెస్ట్ అయినా మనుషులు చాలా మంది ఉన్నారు
రీసెంట్ గా తమిళనాడు నుండి హైదరాబాద్‌కు వచ్చే విమానంలో ఒక ప్రయాణికుడు సిగరెట్ తాగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో జాతీయ విమానయాన సంస్థ (ఏవియేషన్) సిబ్బంది ఈ ప్రయాణికుడిని గుర్తించి, అతనిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు
అది మరువకముందే మారోగటన చోటు చేసుకుంది. టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ అనే వ్యక్తి ఆదివారం శంషాబాద్ నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీస్‌లో అబుదాబికి వెళ్తున్నాడు. విమానం టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో అహ్మద్ రహస్యంగా సిగరెట్ తాగాడు. గమనించిన ఎయిర్ హోస్టెస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో. అహ్మద్‌ను అరెస్ట్ చేసిన RGIA పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి