BJP Vijaya Sankalpa Sabha: పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి.. టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బండి సంజయ్..

Bandi Sanjay: పేదప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా మోదీని తిట్టాలి?.. ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను తీసుకువచ్చినందుకా మోదీని తిట్టాలి?.. దేశ ప్రజల పాలిట దేవుడు.. మోదీ.. అంటూ బండి సంజయ్‌..

BJP Vijaya Sankalpa Sabha: పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి.. టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బండి సంజయ్..
Bandi Sanjay
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 03, 2022 | 8:23 PM

ప్రధాని మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చూస్తే బాధగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించేందుకే ఇక్కడ కార్యవర్గ సమావేశాలు పెట్టామని వివరించారు బండి సంజయ్. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదన్నారు. త్వరలోనే కేసీఆర్‌ గడీలు బద్ధలుగొడతామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. తెలంగాణలో అభివృద్ధి జరగాలని మోదీ పదేపదే చెబుతారని.. కానీ అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే.. బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. కేంద్రంలో మరో 20 ఏళ్లపాటు బీజేపీ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చూస్తే బాధగా ఉందన్నారు. ప్రధాని మోదీని ఎందుకు తిడుతున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు.

బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన మోదీని ఎందుకు తిడుతున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేస్తున్నందుకా? వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినందుకా? పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా? కష్టకాలంలో ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకోచ్చినందుకా? మోదీపై విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అంటూ ప్రశ్నలను సంధించారు బండి సంజయ్. దేశ ప్రజల పాలిట దేవుడు మోదీ. పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి. ఇకపై మోదీని విమర్శిస్తే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు.   బండి సంజయ్ ఫుల్ స్పీచ్     

తెలంగాణ వార్తల కోసం