‘ఎవడ్రా! మా ప్రభుత్వాన్ని పడగొట్టేది..’ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు విపక్షాల రియాక్షన్ ఏంటి?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి.. ప్రారంభంలోనే పతకాస్థాయికి చేరుకుంది. ఇంద్రవెల్లి సభలో శంఖారావం పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీల అమలు మొదలు ప్రతిపక్షాల విమర్శల దాకా.. అన్ని అంశాలపైనా దూకుడుగా కౌంటర్లు వేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలే టార్గెట్‌గా .. పదునైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించింది కాంగ్రెస్ పార్టీ. ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరో రెండు గ్యారెంటీల అమలు ఎప్పుడనే విషయమై స్పష్టత ఇచ్చిన సీఎం.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఏం చేయబోతోందనే విషయాన్ని చెబుతూనే.. తన ప్రసంగంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం కూలిపోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్న రేవంత్… తామొచ్చి 2నెలలే అయినా విమర్శలు చేస్తున్నారంటూ విపక్షంపై మండిపడ్డారు. ఇప్పటికే ఏడువేల స్టాఫ్ నర్సు ఉద్యోగాలిచ్చామన్న సీఎం.. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఓవైపు అభివృద్ధి నినాదం చేస్తూనే బీఆర్‌ఎస్, బీజేపీలను టార్గెట్ చేశారు రేవంత్.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు సమకూర్చేందుకు బిల్డర్లను, వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పాలక, ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలతో.. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో వేడి పీక్స్‌కు చేరింది. తాజా పరిస్థితులతో ఇది ఇంకే స్థాయికి చేరుతుందనేది ఆసక్తి రేపుతోంది.