Hyderabad: సిటీలో మటన్ బిర్యానీ తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేలే

ఇదో మాయా ప్రపంచం. అంతా కల్తీ మయం. ప్రశాంతంగా టీ తాగడానికి లేదు. కడుపు నిండా పసందైన ఫుడ్ తినడానికి లేదు. అంతే ఫేక్ మాఫియా. ఆదమరిస్తే హాంఫట్.

Hyderabad: సిటీలో మటన్ బిర్యానీ తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేలే
Biryani
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2023 | 6:25 PM

హైదరాబాద్‌లో ఉండేవాళ్లు ఇక్కడి బిర్యానీని ఆవురావురుమంటూ రెగ్యులర్‌గా లాగించేస్తూ ఉంటారు. బయటనుంచి వివిధ పనుల నిమిత్తం సిటీకి వచ్చినవారు సైతం బిర్యానీ తినకుండా వెళ్లరు. హైదరాబాదీ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే సిటీలో ఎక్కడ బడితే అక్కడ మటన్ బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని గ్యాంగ్‌లు మటన్ పేరుతో దూడల మాంసాన్ని హోటళ్లకు సప్లై చేస్తున్నాయి. కొన్ని హెటల్స్, రెస్టారెంట్స్ అది మేక మాంసం కాదని తెలిసినా కూడా.. తక్కువ రేటుకు వస్తుండటంతో.. బర్రె దూడల మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. అవును మేము చెప్పేది అక్షరాల నిజం.

కాలాపత్తార్  పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద స్కామ్ వెలుగుచూసింది. దూడలను చంపి మాంసం విక్రయిస్తున్న ముఠా బాగోతం బట్టబయలు అయ్యింది. 5 దూడలను చంపేసి మాంసాన్ని విక్రయిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 దూడలను రక్షించారు. దూడ మాంసాన్ని మటన్ పేరుతో పలు హోటళ్ళకు విక్రయిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. యాసిన్, కురుషి, రఫీల్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే విధంగా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మాంసాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.

చూశారుగా.. పేరు ఉన్న బడా హోటల్స్ అయితే ఓకే.. కానీ బయట చిన్న, చిన్న హెటల్స్, రెస్టారెంట్స్‌లో అయితే మటన్ కర్రీ లేదా మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాలంటే ఒకటికి.. రెండు సార్లు ఆలోచించండి. లేదంటే.. దూడ కూర మీ కడుపులోకి వెళ్లిపోతుంది. బీ అలెర్ట్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం