జులై 8 నుండి హైదరాబాద్‌లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు!

ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, విస్తారంగా వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని కోరుతూ బల్కంపేట ఎల్లమ్మను పూజిస్తూ… ఆషాఢమాసంలో మొదటి మంగళవారం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. మంత్రులు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని అప్పట్లో శివసత్తులు చేసేవారు. 1983లో దేవాలయాన్ని ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ […]

జులై 8 నుండి హైదరాబాద్‌లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2019 | 4:47 PM

ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, విస్తారంగా వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని కోరుతూ బల్కంపేట ఎల్లమ్మను పూజిస్తూ… ఆషాఢమాసంలో మొదటి మంగళవారం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. మంత్రులు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటారు.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని అప్పట్లో శివసత్తులు చేసేవారు. 1983లో దేవాలయాన్ని ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు సాగుతున్నాయి. దేవాలయం ముందు ఉన్న రాజమార్గంలో ప్రత్యేక వేదికపై వేలాది మంది భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలను ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం 9న అంగరంగ వైభవంగా జరుగనుంది. 10న రథోత్సవం ఉంటుంది. కల్యాణం రోజున రెండు లక్షల మంది హాజరవుతారని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేవాలయాన్ని విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు.

ఈ దేవస్థానానికి 700 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆలయం కొలువైన ప్రాంతం ఒకప్పుడు పంటలు పండే భూమి. అప్పట్లో ఓ రైతు పొలంలో నీటి కోసం బావిని తవ్వుతుండగా పది అడుగుల లోతులో ఓ రాతి విగ్రహం బయటపడింది. ఆ భూమి యజమానికి కలలో అమ్మవారు కనిపించి బల్కంపేట ప్రాంతంలో నేను వెలిశాను… గుడి కట్టి పూజించాలని చెప్పిందని ప్రతీతి. అమ్మవారి విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ బావి నుంచి ఏ కాలంలోనైనా జలం ఊరుతూనే ఉంటుంది.