ఏసీబీ కోర్టులో గాలి బెయిల్ కేసు.. సెప్టెంబర్ 12కు విచారణ వాయిదా
బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడు గాలి జనార్థన్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసులో సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారితి ప్రధాన సాక్షిగా ఉన్నారు. నాగమారుతి శర్మ సాక్ష్యాన్ని రికార్డు చేసిన కోర్టు.. కేసు విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఓబులాపురం గనుల మైనింగ్ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డిని సీబీఐ కోర్టు అరెస్టు చేసింది. ఈ కేసులో అప్పటి నుంచి బెయిల్ కోసం సీబీఐ కోర్టు న్యాయమూర్తి పట్టాబికి లంచం ఇవ్వడానికి […]
బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడు గాలి జనార్థన్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసులో సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారితి ప్రధాన సాక్షిగా ఉన్నారు. నాగమారుతి శర్మ సాక్ష్యాన్ని రికార్డు చేసిన కోర్టు.. కేసు విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఓబులాపురం గనుల మైనింగ్ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డిని సీబీఐ కోర్టు అరెస్టు చేసింది. ఈ కేసులో అప్పటి నుంచి బెయిల్ కోసం సీబీఐ కోర్టు న్యాయమూర్తి పట్టాబికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని గాలి జనార్ధన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనికి ముందు నాగమారుతి శర్మకు కూడా లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే లంచం తీసుకుని బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నాగమారుతీ శర్మ తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.