చరిత్రలో నిలిచేలా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలిని పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్.. అవతరణ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. కోటి ఎకరాలకు నీరందించే దిశగా రాష్ట్రం అవతరించిందని సంతోషం వ్యక్తం చేశారు. […]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలిని పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్.. అవతరణ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. కోటి ఎకరాలకు నీరందించే దిశగా రాష్ట్రం అవతరించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నామని.. పూర్వికుల కట్టిన చారిత్రాత్మక కట్టడాల మధ్యలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం చరిత్రలో నిలుస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.