బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేశారో.. కొరడా ఝళిపించిన జీహెచ్‌ఎంసీ

భోపాల్, ఇండోర్ వంటి నగరాల్లో అమలవుతున్న పారిశుధ్య నిబంధనలను పరిగణనలోని తీసుకున్న జీహెచ్ఎంసీ.. అదే రకమైన రూల్స్‌ను భాగ్యనగరంలోనూ అమలుపరచాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. పబ్లిక్ ప్రదేశాలలో చెత్తను పారేయడం, నిర్మాణాల కోసం వృధాగా నీటిని రోడ్లపై వదిలేయడం వంటివాటిని ఇకపై నేరంగా పరిగణించనున్నారు. ఓ యాప్‌ను ఆధారంగా చేసుకొని చలాన్లు విధించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ‘సీఈసీ’ అనే పేరుతో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని పారిశుద్ధ్య నియమాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై […]

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేశారో.. కొరడా ఝళిపించిన జీహెచ్‌ఎంసీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 21, 2019 | 12:38 PM

భోపాల్, ఇండోర్ వంటి నగరాల్లో అమలవుతున్న పారిశుధ్య నిబంధనలను పరిగణనలోని తీసుకున్న జీహెచ్ఎంసీ.. అదే రకమైన రూల్స్‌ను భాగ్యనగరంలోనూ అమలుపరచాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. పబ్లిక్ ప్రదేశాలలో చెత్తను పారేయడం, నిర్మాణాల కోసం వృధాగా నీటిని రోడ్లపై వదిలేయడం వంటివాటిని ఇకపై నేరంగా పరిగణించనున్నారు. ఓ యాప్‌ను ఆధారంగా చేసుకొని చలాన్లు విధించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.

‘సీఈసీ’ అనే పేరుతో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని పారిశుద్ధ్య నియమాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నారు. ఇందులో ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. ఒకసారికి మించి రెండోసారి ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా విధించవచ్చునని వారు అన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో చెత్తను వేసిన పక్షంలో అతడి ఫొటోను, లొకేషన్‌ను అప్‌లోడ్ చేసి జీహెచ్‌ఎంసీకి పంపాల్సి ఉంటుంది. కాగా ఇటీవలే నగరంలోని అపోలో ఆసుపత్రి యాజమాన్యం రోడ్లపై డ్రైనేజీని వృధాగా వదిలేసినందుకు జీహెచ్‌ఎంసీ రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.