నిర్మానుష్య ప్రాంతాలే వాళ్ల టార్గెట్. అర్థరాత్రి అయ్యిందంటే దడ పుట్టిస్తారు. చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు వింటేనే నగర వాసులు భయపడిపోయారు. హైదరాబాదీలను గడగడలాడించిన చెడ్డీ గ్యాంగ్ ఖేల్ ఖతం అయ్యింది. కానీ అలాంటి తరహా ముఠానే.. మరోకటి సీటీలోకి ఎంటర్ అయ్యిందంటున్నారు పోలీసులు. చెడ్డీ గ్యాంగ్.. ఈ గ్యా్ంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. బనీయన్లు, చెడ్డీలు ధరించి, చేతిలో ఓ రాడ్‌తో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ స్పెషల్. ఎలాంటి తాళమైన, డోర్‌నైనా ఒక్క రాడ్ సహాయంతోనే విరగొట్టడం ఈ చెడ్డీ గ్యాంగ్ స్పెషాలిటీ.
దొంగతనానికి వచ్చేటప్పుడే.. తమ వెంట రాళ్లను తెచ్చుకుంటారు. ఎవరైనా చూసిన, చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. చోరీ చేసి వెళ్లేటప్పుడు ఎవరైనా వెంటపడిన వారిపై దాడి చేయడానికి ప్రయత్నించినా.. ఆ రాళ్లతో దాడి చేస్తారు. ఇలా నగర శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతాలలోని కాలనీలను టార్గెట్‌గా చేసుకుంటూ.. వరుస చోరీలకు పాల్పడింది ఈ గ్యాంగ్. ఎట్టకేలకు ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నారు పోలీసులు.
చెడ్డి గ్యాంగ్ కనుమరుగయిపోయిందనుకున్న కొద్ది రోజులు కూడా కాలేదు. చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే మరో గ్యాంగ్.. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లు టార్గెట్‌గా చెడ్డి గ్యాంగ్ చోరీలకు పథకం వేస్తోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గునపాలు, పారలు, కర్రలతో తిరుగుతున్నట్లుగా సీసీ పుటేజ్ లు లభ్యమయ్యాయి.
చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యులు కదలికలు… హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కనిపించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన సైబరాబాద్, రాచకొండ పోలీసులు, చెడ్డి గ్యాంగ్ కోసం పోలీస్ ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు చేపట్టారు. శివారు ప్రాంతాలు ప్రజలు అలర్ట్ ఉండాలని సూచించారు. ఇళ్లు వదిలి దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఎప్పటికప్పుడు పార్శీ గ్యాంగ్ కదలికలపై డేగ కన్ను వేశారు శివారు ప్రాంతాల పోలీసులు.