Telangana: “సూర్య గ్రహణం తర్వాత కలుద్దాం.. అదే రోజు నిర్ణయాలు తీసుకుందాం”.. వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కీలకంగా మారిన ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఈ కాల్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, స్వామీజీ సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్ లో..

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కీలకంగా మారిన ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఈ కాల్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, స్వామీజీ సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్ లో సూర్య గ్రహణం తర్వాత కలుద్దామని స్వామీజీ రోహిత్ రెడ్డితో చెబుతున్నట్లు అర్థమవుతోంది. మీరు నందుని కలిసి మాట్లాడండి..నో ప్రాబ్లం అని, 25 తరువాత ప్లాన్ చేద్దాం.. 26, 27 తరువాత ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పారు. 24 తర్వాత ఒక రోజు వస్తామన్న స్వామీజీ.. అదే రోజు నిర్ణయాలు తీసుకుందామన్నారు. అయితే రోహిత్ రెడ్డి మాత్రం తన పొలిటికల్ కెరీర్, సెక్యూరిటీ అన్నీ నందూజీ చూసుకుంటామన్నారని చెప్పారు. దీంతో నందూపై బాగా ఒత్తిడి ఉందన్న స్వామీజీ.. ఆయన తప్పేమీ లేదన్నారు. సమర్ధులైన వారి కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. మీకు సీఎం గురించి తెలుసన్న రోహిత్ రెడ్డి.. మా పేర్లు బయటకు వస్తే చాలా కష్టం, అలా జరిగితే స్క్రూ చేసే అవకాశం ఉందని చెప్పారు. నెంబర్ 2 ముందు ఆ లిస్ట్ బయట పెట్టగలరా? అన్న స్వామీజీ.. నెంబర్ 1, నెంబర్ 2 ఆయనింటికే వస్తారని తెలిపారు. అదే అక్కడి ప్రొటోకాల్ అని చెప్పడం గమనార్హం. అయితే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం విషయం బయటకు పొక్కనీయకుండా చూడాలని చెప్పడం గమనార్హం.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..