TRS MLAs poaching case: ఫామ్‌హౌస్ కేసులో మరో సంచలనం.. పక్కా స్కెచ్‌తో ఆపరేషన్.. రిమాండ్‌ రిపోర్ట్ ఇదే..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపారని కేసు నమోదు చేశారు పోలీసులు.

TRS MLAs poaching case: ఫామ్‌హౌస్ కేసులో మరో సంచలనం.. పక్కా స్కెచ్‌తో ఆపరేషన్.. రిమాండ్‌ రిపోర్ట్ ఇదే..
Telangana MLAs Poaching Case
Follow us

|

Updated on: Oct 28, 2022 | 9:56 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన ఈ రిపోర్ట్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ కుట్రను చేధించేందుకు నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. హాల్‌లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఫాంహౌజ్ హాల్‌లో మధ్యాహ్నం 3.05 గంటలకి రహస్య కెమెరాలు ఆన్ చేశామన్నారు.

మధ్యాహ్నం 3.10 గంటకలు నిందితులతో కలిసి హాళ్లోకి రోహిత్ రెడ్డి వచ్చారని తెలిపారు పోలీసులు. సాయంత్రం 4.10 గంటలకి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు వచ్చారన్నారు. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారన్నారు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పామన్నారు పోలీసులు. కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోనికి వెళ్లామని పోలీసులు పేర్కొన్నారు.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైందన్నారు పోలీసులు. కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పని చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డయ్యిందన్నారు. తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్లలో రికార్డయిందన్నారు. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్‌కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్‌ను రిమాండ్ నివేదికలో పొందుపరిచారు పోలీసులు. రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీ్న్ షాట్లను కూడా పొందుపరిచారు పోలీసులు. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటు ‘‘సంతోష్ బీజేపీ’’ పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ చేయగా.. ఆ స్క్రీన్ షాట్‌ను కూడా పొందుపరిచారు పోలీసులు. నందు డైరీలో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలున్నాయన్నారు పోలీసులు. అయితే, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..