Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ వచ్చేసింది.. రానున్న రోజుల్లో మరికొన్ని..

ఈ నేపథ్యంలోనే నాగ్‌పూర్‌ నుంచి బయలు దేరిన వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం సికింద్రాబద్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వందే భారత్‌ రైలును రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ శర్మతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్రమంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్...

Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ వచ్చేసింది.. రానున్న రోజుల్లో మరికొన్ని..
Vande Bharat
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 17, 2024 | 6:55 AM

భారత రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కలుపుతూ రైళ్లను తీసుకొచ్చారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణకు మరో వందే భారత్ రైలు వచ్చేసింది. నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ల మధ్య వందే భారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే నాగ్‌పూర్‌ నుంచి బయలు దేరిన వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం సికింద్రాబద్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వందే భారత్‌ రైలును రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ శర్మతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్రమంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా వందేభారత్‌ రైలులో కాసేపు గడిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మొత్తం ఐదు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రైల్వే అభివృద్ధి కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషి చిరాస్మన్యం అన్నారు. తెలంగాణకు మరికొన్ని వందే భారత్‌ రైళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తారని కిషన్ రెడ్డి అన్నారు. నాగపూర్ నుంచి సికింద్రాబాద్‌కు అతి తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడం గొప్ప విషయమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Senubdrabad

ఇదిలా ఉంటే ఈ రైలు రెగ్యులర్‌ సర్వీస్‌ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌‌‌‌లు, 18 చైర్ కార్ కోచ్‌‌‌‌లు..1,440 సీట్లున్నారు. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు మధ్య ఉన్న 585 కిలోమీటర్ల జర్నీ కేవలం 7.15 గంటల్లో చేరుకుంటుంది. నాగ్‌‌‌‌పూర్ నుంచి ఉదయం 5.00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌‌‌‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌‌‌‌ నుంచి మధ్యాహ్నం 1 కి బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌‌‌‌పూర్ చేరుకుంటుంది. మార్గమధ్యలో రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హర్షా, రామగుండం, కాజీపేట రైల్వే స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA