బాబుకు మరో షాక్..అక్రమాస్తుల కేసులో విచారణకు సిద్దమవుతున్న ఏసీబీ
2005 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంద్రబాబుకు తలనొప్పులు తప్పేలా లేవు. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో స్టేలు ఎత్తేవేయమని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులు ఒక్కొక్కటిగా స్టేలు ఎత్తివేస్తూ కేసలు విచారణకు ఆదేశిస్తున్నాయి. ఇందులో భాగంగా 2005లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కేసుపై హైదరాబాద్ హైకోర్టులో ఉన్న స్టేను కూడా ఎత్తేసినట్లు తెలుస్తోంది. […]
2005 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంద్రబాబుకు తలనొప్పులు తప్పేలా లేవు. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో స్టేలు ఎత్తేవేయమని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులు ఒక్కొక్కటిగా స్టేలు ఎత్తివేస్తూ కేసలు విచారణకు ఆదేశిస్తున్నాయి. ఇందులో భాగంగా 2005లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కేసుపై హైదరాబాద్ హైకోర్టులో ఉన్న స్టేను కూడా ఎత్తేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన పదవిని అడ్డు పెట్టుకుని అక్రమంగా డబ్బు సంపాదించారన్నది ఆ కేసు సారాంశం. దీని ఆధారంగా విచారణకు సిద్ధమవుతున్న ఏసీబీ కోర్టు… ఈ కేసు విచారణ కొనసాగింపుకు తన అభిప్రాయం చెప్పాలని పిటిషనర్ అయిన లక్ష్మీపార్వతిని కోరింది. దీంతో ఆమె కోర్టుకు హాజరై విచారణ కొనసాగింపునకు అనుకూలంగానే తన అభిప్రాయం వెల్లడించినట్టు సమాచారం. త్వరలో ఈ కేసు విచారణ ప్రారంభించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తనకు వ్యతిరేకంగా దాఖలైన 27 కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. వాటిలో కొన్ని కేసులు ఆ తర్వాత కొట్టి వేశారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, అనంతరం వైసీపీ తీవ్ర విమర్శలకు దిగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు స్టేలను ఒక్కొక్కటిగా ఎత్తేయడం ప్రారంభిస్తే మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు చిక్కులు తప్పకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మే 13వ తేదీ నుంచి ఏసీబీ కోర్టు రెగ్యులర్ విచారణ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.