Hyderabad: క్రికెట్ బెట్టింగ్ విచారణలో విస్తుపోయే నిజాలు.. రూ. 100 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాదీ రియల్టర్.
క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అయినా ఉన్నపలంగా డబ్బు రావాలనే అత్యాశతో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసలుగా మారుతుంటారు కొందరు. చట్ట విరుద్ధంగా సాగే ఈ దందాకు సంబంధించి నిత్యం ఏదో ఒక చోట పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా...
క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అయినా ఉన్నపలంగా డబ్బు రావాలనే అత్యాశతో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసలుగా మారుతుంటారు కొందరు. చట్ట విరుద్ధంగా సాగే ఈ దందాకు సంబంధించి నిత్యం ఏదో ఒక చోట పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు చేశారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు సబ్ బుకీలు, ఒక కలెక్షన్ ఏజెంటును ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణంలో భాగంగా నిందుతులను అధికారులు శనివారం విచారించారు. అయితే ఈ విచారణలో పోలీసులే ఆశ్చర్యపోయే ఓ నిజం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో అశోక్‌రెడ్డి అనే వ్యక్తి క్రికెట్ బుకింగ్స్‌లో ఏకంగా రూ. 100 కోట్లు కోల్పోయాడు. వనస్థలిపురంలో నివాసముండే అశోక్ రెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ రంగంలో భారీగా సంపద ఆర్జించిన అశోక్ రెడ్డికి క్రికెట్ బెట్టింగ్‌కు వ్యసనంగా మారింది. దీంతో బెట్టింగ్‌లో రూ. లక్షలు పెట్టేవాడు. డబ్బు కోల్పోయిన ప్రతీసారి, రెట్టింపు బెట్టింగ్ చేశాడు. ఇలా 12 ఏళ్లలో ఇతను ఏకంగా రూ. 100 కోట్లు కోల్పోయినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అది విన్న పోలీసులు ఒక్కసారి షాక్‌కి గురయ్యారు.
పోలీసుల విచారణలో భాగంగా అశోక్ ఓ సంస్థను ప్రారంభించి, నష్టాలు రావడంతో ఐపీ పెట్టినట్లు గుర్తించారు. గతకొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఇతను తాజాగా ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యాక క్రికెట్ బుకీగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్‌లో ఉచ్చులో పడ్డ అశోక్ సంపాదించిన దాంతో పాటు ఇతరుల దగ్గర అప్పు చేసి మరీ బెట్టింగ్‌లో పెట్టాడని అయినా మార్పు రాని అశోక్.. ఏకంగా బుకీ అవతారమెత్తినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..