Hyderabad: ఫేస్‌బుక్‌లో పరిచయమైంది, తర్వాత న్యూడ్ కాల్స్ మాట్లాడింది.. చివరికి ఏమైందంటే
కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా రాకతో కమ్యూనికేషన్ బలపడిందన్నది ఎంత నిజమో, మనుషులు మధ్య బంధాలు దూరమవుతున్నాయన్నది అంతే నిజం. వర్చువల్ ప్రపంచంలో బతుకుతూ వాస్తవికతను కోల్పోతున్నాడు మనిషి. సమాజంలో నిత్యం జరుగుతోన్న సంఘటనలే దీనికి...
సోషల్ మీడియా.. మానవ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియా రాకతో సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వాళ్లు మరెక్కడో ఉన్న వాళ్లతో క్షణాల్లో వీడియో కాల్స్‌లో మాట్లాడుకునే అవకాశం లభించింది. రోజువారీ జీవితంలో చేసే ప్రతీ చిన్న పనిని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకునే రోజులు వచ్చేశాయ్. జనాలు కూడా సోషల్ మీడియాను ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు.
ఇదంతా బాగానే ఉన్నా కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా రాకతో కమ్యూనికేషన్ బలపడిందన్నది ఎంత నిజమో, మనుషులు మధ్య బంధాలు దూరమవుతున్నాయన్నది అంతే నిజం. వర్చువల్ ప్రపంచంలో బతుకుతూ వాస్తవికతను కోల్పోతున్నాడు మనిషి. సమాజంలో నిత్యం జరుగుతోన్న సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నేరాలకు సోషల్ మీడియా అడ్డాగా ఎలా మారిందో కళ్లకు కట్టినట్లు ఈ సంఘటన చెబుతోంది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన ఓ చిరు వ్యాపారి (32)కి కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే వెనకా ముందు చూడకుండా యాక్సెప్ట్ చేశేశాడు. కొన్నాళ్లు చాటింగ్ తర్వాత సదరు యువతి కోరడంతో తన పర్సనల్ ఫోన్ నెంబర్‌ను ఇచ్చాడు. దీంతో వీరి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. అనంతరం వ్యవహారం వాట్సాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో వలపు వల విసిరి సదరు వ్యాపారిని ఒంటిపై దుస్తులు తొలగించాలని తెలిపింది.
దీంతో అప్పటికే యువతి మత్తులో మునిగిన సదరు వ్యక్తి క్షణం ఆలోచించకుండా దుస్తులు విప్తేసి పూర్తిగా నగ్నంగా మారాడు. అదే అదునుగా భావించిన యువతి, అతన్ని వీడియోను రికార్డ్ చేసింది. అనంతరం వీడియోను పంపించి డబ్బులు పంపించకపోతే వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అలా బాథితుడి నుంచి విడతల వారీగా మొత్తం రూ. 1.53 లక్షలు నొక్కేసింది. మరింత డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో సదరు యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అపరిచత వ్యక్తుల నుంచి ఎలాంటి కాల్స్ వచ్చినా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..