AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆశ్చర్యం.. 3 అడుగుల్లోనే ఉప్పొంగిన జల సిరి.. చివర్లో మాములు ట్విస్ట్ కాదు..

కొబ్బరి కాయ చేతిలో పెట్టుకుని నీళ్లు అధికంగా ఉండే ప్రదేశాన్ని పరిశీలించారు. ఓ చోట బాగా ఉన్నట్లు సిగ్నల్స్ అందాయి. అక్కడ పూజలు చేసి బోరు తవ్వకాలు షురూ చేశారు. మూడు అడుగులు లోతు కూడా వెళ్లకముందే గంగ ఉబికి వచ్చింది.

Hyderabad: ఆశ్చర్యం.. 3 అడుగుల్లోనే ఉప్పొంగిన జల సిరి.. చివర్లో మాములు ట్విస్ట్ కాదు..
Borewell Drilling (Representative image)
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2023 | 11:23 AM

Share

హైదరాబాద్‌లో సిటీలో వాటర్ పడాలంటే.. కనీసం 50 నుంచి 300 అడుగులు వరకు లోతుకు వెళ్లాల్సిందే. ఫ్యూచర్‌లో ఇబ్బంది రాకూడదని.. కొంతమంది నీళ్లు పడ్డాక కూడా 500 నుంచి 1000 అడుగుల వరకు బోర్ వేయిస్తారు. అలాంటిది సిటీలో 3 అడుగుల్లోపే నీళ్లు పడితే.. అవాక్కవ్వకుండా ఎవరుంటారు చెప్పండి. చింతలబస్తీ మెయిన్‌రోడ్‌లో అదే ఘటన జరిగింది. అయితే ఇక్కడ ఓ దిమ్మతిరిగే ట్విస్ట్ కూడా ఉంది. చింతలబస్తీలో ఇటీవల ఒక సామాజిక భవనం నిర్మించారు. ఈ బిల్డింగ్‌లో నీటి సౌకర్యం కోసం బోర్ వేయడానికి ఎంపీ నిధులు రిలీజయ్యాయి. దీంలో లోకల్ లీడర్స్ పెద్ద బోర్ వెల్ మెషీన్ తెప్పించారు. బిల్డింగ్ ఏరియాలో సరిపడనంత ప్లేస్ లేకపోవడంతో.. బయట రోడ్డు పక్కన వేయాలనుకున్నారు. వాటర్ ఎక్కువ ఎక్కడా ఉన్నాయో తెలుసుకునేందుకు కోబ్బరికాయతో ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఒక ప్రాంతంలో వాటర్ ఉన్నట్లు అనిపించడంతో.. అక్కడ బోరు వేయడం షురూ చేశారు.

అయితే ఇలా బోర్ వేయడం మొదలెట్టారో లేదో.. 3 అడుగులు వేసేసరికి జలధార కనిపించింది. చిమ్మకుంటూ నీళ్లు బయటకు వచ్చాయి. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇదేలా సాధ్యం అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. అయితే బోర్ వేయడం ఆపిన తర్వాత నీళ్లు రావడంతో ఏదో తేడా కొట్టింది. పరిశీలించి చూడగా.. నల్లా పైప్‌లైన్ మీద బోర్ వేసినట్లు తేలింది. అది 50 ఏళ్ల నాటి భారీ తాగునీటి పైప్‌లైన్ అని అధికారులు నిర్ధారించారు. సమచారంతో జలమండలి అధికారులు చేరుకుని.. ఆ పైప్ లైన్‌ను పరిశీలించారు. రెండుగా చీలిపోవడంతో రిపేర్ చేసి నీటి సరఫరాను పునరుద్దరించారు. పైప్‌లైన్ మీద బోర్లు వేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా తర్వాత ఆ పక్కనే బోర్ వేయగా.. దాదాపు 40 అడుగుల మేర తవ్వాక నీరు పడింది.

Bore

Bore

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..