Hyderabad Elephant Rani: హైదరాబాద్ జంతు ప్రేమికులకు విషాదం.. జూపార్క్ లో 83 ఏళ్ల ఏనుగు రాణి.. 21 ఏళ్ల చిరుత అయ్యప్ప మృతి

Hyderabad Elephant Rani: హైదరాబాద్ జూ పార్క్ తో అనుబధం ఉన్నవారికి..ముఖ్యంగా జంతు ప్రేమికులకు ఈరోజు రెండు దుర్వార్తలు. హైదరాబాద్ జూ పార్క్ లో 83 ఏళ్ల ఆడ ఏనుగు రాణి, 21 ఏళ్ల మగ చిరుతపులి అయ్యప్ప కన్నుమూశాయి.

Hyderabad Elephant Rani: హైదరాబాద్ జంతు ప్రేమికులకు విషాదం.. జూపార్క్ లో 83 ఏళ్ల ఏనుగు రాణి.. 21 ఏళ్ల చిరుత అయ్యప్ప మృతి
Hyderabad Elephant Rani
Follow us

|

Updated on: Jun 09, 2021 | 9:06 PM

Hyderabad Elephant Rani:  హైదరాబాద్ జూ పార్క్ తో అనుబధం ఉన్నవారికి..ముఖ్యంగా జంతు ప్రేమికులకు ఈరోజు రెండు దుర్వార్తలు. హైదరాబాద్ జూ పార్క్ లో 83 ఏళ్ల ఆడ ఏనుగు రాణి, 21 ఏళ్ల మగ చిరుతపులి అయ్యప్ప కన్నుమూశాయి. జంతు ప్రేమికులను ఈ విషయం విషాదంలో ముంచెత్తేదే. ఎందుకంటే.. 83 ఏళ్ల రాణి తో అందరికీ అనుబంధం ఎక్కువ. దశాబ్దాలుగా వార్షిక బోనాలు కార్యక్రమంలోనూ, మొహర్రం ఊరేగింపులలోనూ రాణి ప్రజలకు చాలా చేరువయింది. వృద్ధాప్యం కారణంగా ఇటీవల కొంతకాలంగా ఏనుగు రాణి అనారోగ్యంతో బాధపడుతోంది. జూ పశువైద్య సిబ్బంది యొక్క సాధారణ చికిత్స ,పర్యవేక్షణలో ఉంది. ఆర్థరైటిస్ కారణంగా ఇతర ఏనుగుల మాదిరిగా పడుకోలేక విశ్రాంతి తీసుకోలేని పరిస్థితుల్లో రాణి జీవిస్తోంది. సహాయక ఔషధాల మీద రాణిని బ్రతికుంచుకుంటూ వచ్చారు. రాణి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి జూ సిబ్బంది ఆవరణలో ఒక మట్టి దిబ్బను సృష్టించారు. రాణిని గత ఏడాది జూలైలో అపోలో ఫౌండేషన్ & అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపసనా కామినేని కొణిదెల ఒక సంవత్సరం కాలానికి దత్తత తీసుకున్నారు.

పోస్ట్‌మార్టం ద్వారా వృద్ధాప్యానికి సంబంధించిన బహుళ అవయవ వైఫల్యాలు మరణానికి కారణమని తెలిసింది. ఇక సాధారణంగా జూలలో బంధించినట్టు ఉండే ఆసియా ఏనుగుల సగటు జీవిత కాలం 70 సంవత్సరాలు. రాణి అంతకంటే చాలా ఎక్కువకాలం అంటే 83 ఏళ్లు జీవించింది. రాణి చివరి రోజు వరకు ఆహారాన్ని తీసుకుందని, పెద్ద శారీరక బాధలు లేకుండా జూన్ 8 న కన్నుమూశారని జూ అధికారులు తెలిపారు.

ఇక ఇదేరోజు హైదరాబాద్ జూలో మరో విషాదం నెలకొంది. 21 ఏళ్ల చిరుత పులి అయ్యప్ప కూడా ఈరోజు మరణించింది. ఇది జూన్ 2000 లో ఎస్వీ జూ పార్క్ తిరుపతిలో జన్మించింది. దీనిని చిన్నగా ఉన్నప్పుడే అక్కడ నుంచి హైదరబాద్ జూపార్క్ కు తీసుకువచ్చారు. వృద్ధాప్యం మరియు బహుళ అవయవ వైఫల్యం కారణంగా ఈ చిరుత పులి బుధవారం మరణించినట్లు జూ అధికారులు తెలిపారు.

Also Read: BIG BREAKING: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం.!

Hyderabad Metro: లాక్‏డౌన్ సడలింపు.. రేపట్నుంచి హైదరాబాద్‏లో మెట్రో పరుగులు.. మారిన టైమింగ్స్ ఇవే..