AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: సహజీవనంలో స్మాల్ బ్రేక్.. ఢిల్లీ టు బెంగళూరు షిఫ్ట్.. కట్ చేస్తే హైదరాబాదీ యువతి ఆకాంక్ష హత్య.. అసలేం జరిగిందంటే..

Bengaluru News in Telugu: సహజీవనం చేసిన యువకుడి చేతిలో ఓ యువతి దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. జీవనబీమానగర పోలీసు స్టేషన్‌ పరిధి కోడిహళ్లిలో హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్‌ సోమవారం రాత్రి ఠాణా పరిధిలోని కోడిహళ్లిలో హత్యకు గురయ్యారు.

Bengaluru: సహజీవనంలో స్మాల్ బ్రేక్.. ఢిల్లీ టు బెంగళూరు షిఫ్ట్.. కట్ చేస్తే హైదరాబాదీ యువతి ఆకాంక్ష హత్య.. అసలేం జరిగిందంటే..
Arpit And Akanksha
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 07, 2023 | 3:04 PM

Share

Bengaluru News in Telugu: ఆకాంక్ష, అర్పిత్‌కు ఢిల్లీలో ఉండగానే పరిచయం ఉంది. ఇద్దరు కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. ఆకాంక్షకు వేరే ఉద్యోగం రావడంతో ఆమె బెంగళూరులో షిఫ్ట్‌ అయింది. ఆమెను కలిసేందుకు అర్పిత్‌ తరచూ బెంగళూరుకు వచ్చేవాడు. ఈనెల 5న బెంగళూరులోని జీవన్ భీమా నగర్‌లోని ఓ అపార్ట్మెంట్‌లో ఉంటున్న ఆకాంక్ష దగ్గరకు వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఆ కోపంలో ఆకాంక్షను అర్పిత్‌ హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. ఆకాంక్ష మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అర్పిత్ ప్రయత్నించాడు. ఒక్కడితో అది సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని నేలపై వదిలేసి ఇంటి తలుపులు వేసి పరారయ్యాడు.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు, తరచూ గొడవలు జరిగేవని ఆకాంక్ష ఫ్లాట్‌మేట్స్‌ చెబుతున్నారు. చివరికి ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహంతో అర్పిత్ తన ప్రియురాలు ఆకాంక్షను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో నివాసముండే జ్ఞానేశ్వర్ కు ముగ్గురు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు.పెద్ద కూతురు ఆకాంక్ష బెంగుళూరులో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తూ అక్కడి జీవన్ భీమాన్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడిహళ్లిలో నివాసముటుంది. హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడు, సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే అర్పిత్ అనే వ్యక్తితో ఆకాంక్షకు పరిచయం ఏర్పడింది. ఆకాంక్ష, అర్పిత్‌ కలిసి ఉంటున్నారు. ఆ తరువాత ఆకాంక్ష బెంగుళూర్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అర్పిత్ వీకెండ్‌లో బెంగుళూరుకు వెళ్ళి ఆకాంక్షను కలుస్తుండే వాడని తెలిసింది.

సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరుగగా.. కోపంతో ఆర్పిత్ ఆకాంక్షను గొంతు నులిమి హత్య చేసి పారిపోయడు. మంగళవారం ఉదయం రూం మెంట్ వచ్చేసరికి ఆకాంక్ష విగతజీవిగా పడి ఉందని స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న బెంగుళూర్ పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్నీ కుటుంబ సభ్యులకు అప్పగించారు. బుధవారం ఉదయం గోదావరిఖనికి చేరుకున్న ఆకాంక్ష మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో ఆకాంక్ష ఇలా అనూహ్యంగా మృత్యు ఒడిలోకి చేరుకోవడం కుటుంబ సభ్యులను తీరని శోకానికి గురిచేసింది. తమ కూతురి ప్రాణాలను బలిగొన్న నిందితున్ని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు ఆకాంక్ష తల్లిదండ్రులు. చంపిన తరువాత ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేసాడు.. ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు ప్లాన్ చేసాడు.. అలా చేయడం సాధ్యం కాలేదు.. రూమ్ లో నే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అర్పిత్ కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం