Hyderabad: ఈత కొట్టేందుకు జలాశయంలో దిగి.. ఇద్దరు హైదరాబాద్ యువకుల గల్లంతు..
ఈత కోసం జలాశయంలో దిగిన యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.
Kondapochamma reservoir: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేట కొండపోచమ్మ జలాశయంలో.. హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈత కోసం జలాశయంలో దిగిన యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు, ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గల్లంతైన యువకులు హైదరాబాద్‌కు చెందిన అక్షయ్ వెంకట్ (28), రాజన్ శర్మ (28)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి