AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘మీకు ఏ సర్టిఫికెట్ కావాలి? ఇదిగో తీసుకో’.. కేటుగాళ్ల మాయా ప్రపంచం.. బెండు తీసిన ఖాకీలు..!

డిగ్రీ కావాలా అయితే 20,000.. పీజీ కావాలా అయితే 30,000.. ఇవి కోర్సు ఫీజులు అనుకుంటే మీరు పొరపడినట్లే... అంగట్లో అమ్ముకునేందుకు కొందరు కేటుగాళ్లు సర్టిఫికెట్లకు పెట్టిన రేట్లు ఇవి.. ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ కావాలి అన్నా ఈ విధంగా వేల వేల రూపాయలు దోచుకొని సర్టిఫికెట్లను అమ్మడమే ఈ ముఠా యొక్క లక్ష్యం.

Hyderabad: ‘మీకు ఏ సర్టిఫికెట్ కావాలి? ఇదిగో తీసుకో’.. కేటుగాళ్ల మాయా ప్రపంచం.. బెండు తీసిన ఖాకీలు..!
Fake
Peddaprolu Jyothi
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 20, 2023 | 10:03 AM

Share

డిగ్రీ కావాలా అయితే 20,000.. పీజీ కావాలా అయితే 30,000.. ఇవి కోర్సు ఫీజులు అనుకుంటే మీరు పొరపడినట్లే… అంగట్లో అమ్ముకునేందుకు కొందరు కేటుగాళ్లు సర్టిఫికెట్లకు పెట్టిన రేట్లు ఇవి.. ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ కావాలి అన్నా ఈ విధంగా వేల వేల రూపాయలు దోచుకొని సర్టిఫికెట్లను అమ్మడమే ఈ ముఠా యొక్క లక్ష్యం. డబ్బులు కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది ఈ ముఠా.

డిగ్రీ నుండి పీజీ దాకా..

మీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇక్కడ అన్ని దొరుకుతాయి.. మీ చదువుకు తగ్గట్టు ఏ సర్టిఫికెట్ కావాలి అనుకుంటే అంత డబ్బు చెల్లిస్తే చాలు మీ చేతిలోకి సర్టిఫికెట్ వస్తుంది. ఇలా మాయ మాటలు చెప్పి విద్యార్థులను మోసపోయేలా చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. గతంలో విసాల పేరిట, స్టడీ సర్టిఫికెట్ల పేరిట ఎన్నో కేసులు నమోదు చేసినా.. ఏదో ఒక మూల నుండి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు ఈ నకిలీ గాళ్ళు. మేము ఇస్తాం సర్టిఫికేట్స్ అంటూ విద్యార్థుల నుండి డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లను అచ్చం యూనివర్సిటీ సర్టిఫికెట్ లాగా ముద్రించి విద్యార్థులకు అందజేస్తున్నారు. అది నిజమే అని భావించిన విద్యార్థులు విదేశాలకు వెళ్లిన తర్వాత లేదా యూనివర్సిటీలకు వెళ్లిన తర్వాత అవి నకిలీ సర్టిఫికెట్లను తెలిసి మోసపోతున్నారు.

తాజాగా RGIA పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషయం.. విద్యార్థులను, తల్లిదండ్రులను ఉలిక్కి పడేలా చేసింది. అంగట్లో సర్కుల్లాగా నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ఐదు మంది నిందితులను ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నా ఈ ముఠాను ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేయగా నిందితులను పోలీసులకు అప్పగించారు. తయారు చేసేందుకు ఉపయోగించిన సామాగ్రిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి చారుకొండ గ్రామానికి చెందిన దేవేందర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చైతన్య రెడ్డిలు శంషాబాద్ ఆదర్శనగర్ కు చెందిన నాగేశ్వరరావు అతని స్నేహితుడు సాయిబాబాతో ఈ నలుగురికి పరిచయం ఏర్పడింది. అయితే అదే పరిచయంతో దూరవిద్య చదివేందుకు ఎంఎస్సీ ఆనాలిటికల్ సర్టిఫికెట్ల కోసం నాగేశ్వరరావు ప్రధాన సూత్రధారి దేవేందర్ ను సంప్రదించాడు.

నేను మీకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇప్పిస్తాను అని మాయమాటలు చెప్పి బాధితుడు ని నమ్మించాడు దేవేందర్.. అయితే ఒక సర్టిఫికెట్ కు 20,000 అవుతుందని చెప్పడం తో నాగేశ్వరరావు అడ్వాన్సుగా 20వేల రూపాయలు ఇచ్చాడు అనంతరం శంకర్ రెడ్డి నాగేశ్వరరావు వద్దకు వచ్చి 20000 తీసుకొని సర్టిఫికెట్లు ఇచ్చారు.. ఆ సర్టిఫికెట్లు గమనించగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ బ్రాంచ్ కు సంబంధించినటువంటి నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి.. దీంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు శంకర్ రెడ్డిని మరియు మరొక వ్యక్తిని నిలదీశాడు.. పరీక్షలు రాయకుండానే సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని బాధితుడు నాగేశ్వరరావు అడగడంతో అవన్నీ నీకెందుకు అంటూ బాధితున్ని హెచ్చరించారు నిందితులు.దింతో అక్రమ మార్గంలో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి అమాయకులకు కట్టబెడుతున్నారని బాధితుడు నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు స్థానిక పోలీసులు నిందితులను పట్టుకున్నారు నిందితుల దగ్గర నుండి రెండు కలర్ ప్రింటర్స్, రెండు మానిటర్స్, సిపియు రెండు హార్డ్ డిస్కులు, 6 స్టాంపులు, రెండు డేట్ స్టాంపులు, పేపర్ కటింగ్ మిషన్ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ మరియు పీజీ, జేఎన్టీయూ యూనివర్సిటీ, హైదరాబాద్ జేఎన్టీయూ పాలిటెక్నిక్, ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ, శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్, కాకతీయ యూనివర్సిటీ లకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ ను సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..