Hyderabad: అల్లం, వెల్లుల్లి ప్యాకెట్స్ కొంటున్నారా? కళ్లు బైర్లు కమ్మే న్యూస్.. అంతా కల్తీయే..

సమ్మర్ కదా అని పిల్లలకు ఐస్ క్రీమ్‌లు కొనిస్తున్నాం.. ప్యాకింగ్ బాగుందని పాలు, నూనెలు కొంటున్నాం.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చీప్‌గా వస్తుందని టెంప్ట్ అవుతున్నాం.. ఇలా చేస్తూ చేజేతులా మనం రిస్క్‌లో పడుతున్నాం. కల్తీ అల్లం వెల్లుల్లి, కల్తీ పాలు, కల్తీ ఐస్‌క్రీమ్‌లు, కల్తీ చాక్లెట్లు.. చిన్న పిల్లలు తింటారన్న ఇంగీతం లేదు.. ప్రాణాలు పోతాయన్న ఆలోచన లేదు..

Hyderabad: అల్లం, వెల్లుల్లి ప్యాకెట్స్ కొంటున్నారా? కళ్లు బైర్లు కమ్మే న్యూస్.. అంతా కల్తీయే..
Ginger Adulteration
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2023 | 1:03 PM

సమ్మర్ కదా అని పిల్లలకు ఐస్ క్రీమ్‌లు కొనిస్తున్నాం.. ప్యాకింగ్ బాగుందని పాలు, నూనెలు కొంటున్నాం.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చీప్‌గా వస్తుందని టెంప్ట్ అవుతున్నాం.. ఇలా చేస్తూ చేజేతులా మనం రిస్క్‌లో పడుతున్నాం. కల్తీ అల్లం వెల్లుల్లి, కల్తీ పాలు, కల్తీ ఐస్‌క్రీమ్‌లు, కల్తీ చాక్లెట్లు.. చిన్న పిల్లలు తింటారన్న ఇంగీతం లేదు.. ప్రాణాలు పోతాయన్న ఆలోచన లేదు.. గల్లాపెట్టె నిండాలన్న కక్కుర్తితో కొంతమంది కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వరుసగా వెలుగులోకొస్తున్న నకిలీలలు.. జనాన్ని వణికిస్తున్నాయి. ఏది తినాలి.. ఏది తినకూడదన్న ఆలోచనలో పడిపోతున్నారు.

కాదేదీ కల్తీకి అనర్హం అంటూ కల్తీ రాయుళ్లు మనం తినే ఆహార పదార్ధాలను యధేచ్చగా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కందిపప్పులో కేసరి పప్పు.. పాలు చిక్కగా కన్పించేందుకు బియ్యం పిండి కలుపుతున్నారు. శనగపిండి, ధనియాల పొడి, కారం పొడి, వక్కపొడి, నెయ్యి, పంచదార, ఐస్‌క్రీమ్‌, చాక్లెట్లు, కాఫీ, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంటనూనెలు ఇలా మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ రాజ్యమేలుతోంది.

చికెన్‌ కర్రీ టేస్టీ టేస్టీగా రావాలంటే జింజర్‌ పేస్ట్‌ కావాల్సిందే. బిర్యానీ అయినా.. మరేదైనా వంటకమైనా అల్లం, వెల్లుల్లి పేస్ట్ లేనిదే పనవ్వదు. అలాంటి అల్లం పేస్ట్‌ను కల్తీ చేస్తూ దారుణంగా చీట్‌ చేస్తోంది ఓ ముఠా. హైదరాబాద్‌లో ఈ ముఠా అరాచకాలు చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే.

ఇవి కూడా చదవండి

కొద్దిరోజుల క్రితం ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. లక్షల విలువైన కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అల్లం పేస్ట్‌ను కల్తీ చేస్తున్న ఇద్దరు నిర్వాహకుల్ని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో ఓ డెన్‌లో తనిఖీలు చేసిన పోలీసులు.. అక్కడ సిట్యువేషన్ చూసి షాకయ్యారు. అపరిశుభ్ర వాతావరణం.. మురుగునీటి వినియోగం.. ప్రమాదకరమైన కెమికల్స్‌తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతి లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నారు. కల్తీ అల్లాన్ని ఆకర్షణీయమైన ప్యాకెట్లలో నింపి మార్కెట్‌కు తరలిస్తున్నారు. మొత్తం 500 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్‌, 200 లీటర్ల అసిటిక్ యాసిడ్‌, 550 కేజీల నాన్‌ వెజ్ మసాల ప్యాకెట్లను సీజ్ చేసి, ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు.

ఫుడ్ ఐటమ్స్ ను కల్తీ చేసేవారిని శిక్షించాలి. కల్తీ కేంద్రాలపై నిరంతరం నిఘా పెట్టాలి. అలాగైతేనే పరిస్థితిలో మార్పు వస్తుందంటున్నారు నగర జనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..