AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లు తప్పు చేసినా.. స్కూల్‌ యాజమాన్యంపై కేసులు పెడతాం! హైదరాబాద్‌ పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్ పోలీసులు పాఠశాల బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి బస్సులో CCTV కెమెరాలు తప్పనిసరి చేస్తూ, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాళ్లు తప్పు చేసినా.. స్కూల్‌ యాజమాన్యంపై కేసులు పెడతాం! హైదరాబాద్‌ పోలీసుల హెచ్చరిక
School Bus
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 2:34 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్స్ ఇప్పటికే తెచ్చుకున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు స్కూల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా స్కూల్ కు పిల్లలను తీసుకెళ్లే బస్సులు, వాటికి సంబంధించిన ట్రాఫిక్ అంశాలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఫోకస్ చేశారు. స్కూల్ ముగిసిన తర్వాత స్కూల్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ లేకుండా చేయటంతో పాటు స్కూల్ ఆవరణలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కొత్త ప్రణాళికలను ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేశారు.

ఇందులో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాలను కోరారు. ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. మరోవైపు స్కూల్ కు 200 మీటర్ల దూరంలో ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో స్కూల్ లు ప్రారంభమైన రెండు రోజుల్లోనే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా చాలామంది స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 14 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపినట్లు గుర్తించారు.

అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో స్కూల్ బస్సుల వల్ల సాయంత్రం వేళలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అవుతుండడం గుర్తించిన పోలీసులు స్కూల్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీరు ఇచ్చిన సూచనల ఆధారంగా త్వరలోనే ట్రాఫిక్ కొత్త ప్రణాళికలను రూపొందించనున్నట్లు హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..