AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడు.. కోర్టులో జరిమాన కట్టమన్న పోలీసులకు ఝలక్.. ఏం చేశాడంటే..

కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఇటీవల డ్రింక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ యువకుడు.. కోర్టుకు హాజరై జరిమానా కట్టాల్సి వస్తుందని భయపడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడు.. కోర్టులో జరిమాన కట్టమన్న పోలీసులకు ఝలక్.. ఏం చేశాడంటే..
Crime
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 2:46 PM

Share

డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడు.. కోర్టుకు హాజరై జరిమా కట్టాలని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో.. భయాందోళనకు గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బర్లిఫిట్ ఏరియాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఇరు గోపి(25). ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చదువుతుండగా.. గోపి కూడా అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు వర్కర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల మద్యం సేవించిన తర్వాత బైక్‌ నడుపుతూ ఇంటికి వెళ్తున్న గోపి ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. దీంతో గోపి వివరాలు తీసుకున్న పోలీసులు అతన్ని పంపేశారు.

అయితే, ఈ నెల 19న పోలీసులు గోపికి ఫోన్ చేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించి కోర్టుకు హాజరై జరిమానా కట్టాలని తెలిపారు. మరుసటి రోజు కలుస్తానని చెప్పిన గోపి శుక్రవారం సమయానికి రాకపోవడంతో పోలీసులు ఫోన్ చేసి గుర్తు చేశారు. అయితే జరిమానా కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందనీ పోలీసులు గోపికి తెలిపారు. దీంతో భయపడిపోయిన గోపి తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తరువాత భార్యను కళాశాల వద్ద దింపి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇక కాలేజ్‌ నుంచి ఇంటికి వచ్చిన గోపి భార్య ఇంట్లో దూలానికి వేలాడుతున్న భర్తను చూసి షాక్‌కు గురైంది. వెంటనే గోపి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయం తెలిపింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గోపి తల్లిదండ్రులు, కోడలిని తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కోర్టుకు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు భయపెట్టడంతో తన భర్త ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని గోపి భార్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?