AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meru Vijetha: విజయవంతంగా ముగిసిన ‘మేరు విజేత’ కాంపిటేషన్.. 2వేలకు పైగా పాల్గొన్న విద్యార్థులు..

Meru Vijetha: హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన మేరు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన ‘మేరు విజేత’ పోటీలు ముగిశాయి.

Meru Vijetha: విజయవంతంగా ముగిసిన ‘మేరు విజేత’ కాంపిటేషన్.. 2వేలకు పైగా పాల్గొన్న విద్యార్థులు..
Shiva Prajapati
|

Updated on: Jan 27, 2022 | 10:15 PM

Share

Meru Vijetha: హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన మేరు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన ‘మేరు విజేత’ పోటీలు ముగిశాయి. 20 నవంబర్, 2021 నుంచి జనవరి 26 వరకు రెండు నెలల పాటు జరిగిన నగరంలోని అతిపెద్ద టౌన్‌షిప్ స్థాయి ఈవెంట్ ‘మేరు విజేత’ ముగిసింది. ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులందరికీ బహుమతులు ప్రదానం చేశారు నిర్వాహకులు. కాగా, ఈ పోటీల్లో నగరంలోని 34 టౌన్‌షిప్‌లకు చెందిన 2 వేల మందికి పైగా పిల్లలు క్విజ్ వంటి వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. కథలు, సంగీతం, గానం, జుంబా, వెస్ట్రన్ డ్యాన్స్, సాంసృతిక కార్యక్రమాలు, ఇతర కళా పోటీల్లో విద్యార్థులు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.

మేరు విజేత వివిధ రంగాలలో ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించి, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడానికి వారికి మార్గదర్శకత్వం ఇస్తుంది. తద్వారా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకువస్తారని మేరు ఉద్దేశం.

హైదరాబాద్‌లో ఉన్న ప్రధానమైన విద్యా సంస్థల్లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి. తరగతి గది లోపల, బయటా పిల్లల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి మేరు కృషి చేస్తోంది. కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యూకేషన్(CAIE)&CBSE అనుబంధంతో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

‘మేరు విజేత’ పోటీలను నిర్వహించడం ఇది రెండవసారి. మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌.. ఫైనాన్స్‌పీర్, విజేత, igebra.ai అనే మూడు బ్రాండ్‌ల సహకార ప్రయత్నం ఈ పోటీలు. ఇందులో పాల్గొనేవారు వివిధ రంగాల్లో నిపుణులు, న్యాయమూర్తులతో సంభాషించడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులు వారి నుంచి పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. విద్యార్థుల నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవడానికి సలహాలు, సూచనలు పొందడానికి ఇది సహాయపడుతుంది.

‘మేరు విజేత’ కాంపిటీషన్‌ గురించి మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్ పిళ్లై మాట్లాడుతూ.. “తరగతి గది వెలుపల నిర్మాణాత్మకమైన ఆసక్తులు, అభిరుచిని అన్వేషించగల సామర్థ్యంతో విద్యార్థులను బలోపేతం చేయడం, వారి దృక్కోణాలు, ప్రపంచ దృష్టికోణాన్ని విస్తృతం చేయడంలో ఈ పోటీలు ఉపకరిస్తాయని విశ్వసిస్తున్నాం. ప్రపంచ స్థాయి నాయకులు, ఆవిష్కర్తలుగా వారిని సిద్ధం చేయడంలో ఇవి చాలా కీలకం. వారు తమ అభిరుచులను వ్యక్తపరచడం ద్వారా, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పిల్లలు తాము రాణించాలనుకునే పాఠ్యేతర కార్యకలాపాలను ఎంచుకునే, నిర్ణయించుకునే సామర్థ్యం రావాలని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.’’ అని చెప్పుకొచ్చారు. చివరగా, ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న ప్రతి విద్యార్థిని, వారికి సపోర్ట్‌గా నిలిచిన తల్లిదండ్రులను ఆయన ఆభినందించారు.

Also read:

Wine: వైన్ ప్రియులకు ఆ రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్.. ఇక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో ..

Crime News: రిపబ్లిక్ డే రోజున పట్టపగలు యువకుడిపై దుండగుల కాల్పులు! స్పాట్‌లోనే..

keerthy suresh: గ్రీన్ డ్రెస్ లో మైమరిపిస్తున మహానటి క్యుట్ స్టిల్స్ వైరల్