Telangana: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ వ్యవహారం, నటి సమంత విడాకుల వివాదం వంటి సున్నితమైన అంశాలలో మాజీ మంత్రి కేటీ రామారావుపై మంత్రి సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకుని కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ అంశం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తో్ంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
