AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ameerpet: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు

Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. రెండో అంతస్తులో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు..

Ameerpet: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు
Ameerpet Fire Accident
Subhash Goud
|

Updated on: Jun 04, 2026 | 1:50 PM

Share

Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. రెండో అంతస్తులో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పక్క షాపులకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగలు వ్యాపిస్తుండటంతో వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు.

మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న KSR ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణం ఉన్న బిల్డింగ్‌ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు. అంతేకాకుండా పక్కనే ఉన్న హర్ష మెస్ తో పాటు ఇతర షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు, స్థానిక వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదాన్ని అధికారులు సమీక్షిస్తున్నారు. మంటలను అదుపు తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు అగ్ని మాపక సిబ్బంది. రోడ్డు కూడా కనిపించనంత దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలను ఆర్పేందుకు మరిన్ని ట్యాంకర్లను రప్పిస్తున్నారు. అయితే  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు ప్రకటించారు. షాట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ట్రాఫిక్ అలర్ట్

అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అత్యవసర సహాయక చర్యల కారణంగా అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

Follow Us