Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో సంచలనాలు.. నలుగురు నిందితుల్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల కొడుకులు

Minor Girl Rape Case: రేప్‌ ఘటనలో ప్రజాప్రతినిధుల కొడుకులు ఉన్నట్లు తెలుస్తోంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌, బహదూర్‌పురా ఎమ్మెల్యే కొడుకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అమినేషియా పబ్‌లోనే అమ్మాయిని ట్రాప్ చేసిన నిందితులు.. సిటీలిమిట్స్‌లో కారులోనే..

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో సంచలనాలు.. నలుగురు నిందితుల్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల కొడుకులు
Jubilee Hills Minor rape case
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 03, 2022 | 4:30 PM

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ మైనర్‌ రేప్‌ కేసులో(Rape Case) సంచలన విషయాలు వెలుగుజూస్తున్నాయి. రేప్‌కేసులో మొత్తం నలుగురు నిందితులను గుర్తించారు పోలీసులు. రేప్‌ ఘటనలో ప్రజాప్రతినిధుల కొడుకులు ఉన్నట్లు తెలుస్తోంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌, బహదూర్‌పురా ఎమ్మెల్యే కొడుకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అమినేషియా పబ్‌లోనే అమ్మాయిని ట్రాప్ చేసిన నిందితులు.. సిటీలిమిట్స్‌లో కారులోనే లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేల్చారు. నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో ఓ మైనర్‌ కూడా ఉండడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌(Jubilee Hills) మైనర్‌రేప్‌ ఘటనలో పోలీసుల తీరుపై ఫైరవుతున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వమే నిందితులను దాచిపెడుతోందని ఆరోపిస్తున్నారు. రేప్‌ జరిగిన మూడ్రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అంటూ నిలదీస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగేదాకా బీజేపీ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు.

మైనర్‌రేప్‌ ఘటనలో నిందితులను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఈ కేసులో రాజకీయపార్టీల నేతలు ఉన్నందునే కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అందుకు ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే నిదర్శనమన్నారు.

మైనర్‌ రేప్‌ ఘటనలో ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధుల కొడుకులు ఉన్నందునే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేత కృష్ణసాగర్. నిందితుల కారు దొరికింది.. కారు నంబరు గుర్తించారు.. కానీ నిందితులను మాత్రం దాస్తున్నారెందుకని ప్రశ్నిస్తున్నారు.

అసలు అమ్నేషియా పబ్‌లో నిర్వహించిన పార్టీకి మైనర్‌ను అనుమతించడంపై పబ్ యాజమాన్యంపై కేసు నమోదుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆ పబ్‌‌లో ఆరోజు ఎంత మంది మైనర్లు ఉన్నారనే విషయంపై దృష్టి సాధించారు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి