Hyderabad: ముగిసిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. విజేత ఎవరంటే…?

హుస్సేన్‌సాగర్‌ తీరాన శనివారం ప్రారంభమైన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ముగిసింది. 417.5 పాయింట్లతో కొచ్చి టీమ్‌ విజేతగా నిలిచింది.

Hyderabad: ముగిసిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. విజేత ఎవరంటే...?
Indian Racing League
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 11, 2022 | 6:39 PM

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు ముగిశాయి. కొచ్చి టీమ్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. గట్టి పోటీ ఇచ్చిన హైదరాబాద్‌ జట్టుకు రెండో స్థానం దక్కింది. హైదరాబాద్‌లో తొలిసారి జరిగిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ కలర్‌ఫుల్‌గా ముగిసింది. 417.5 పాయింట్లతో కొచ్చి టీమ్‌ ఈ పోటీల్లో విజేతగా నిలిచింది. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ లో మొదటి రెండు రేస్ లు గెలుచుకుంది కొచ్చిటీమ్‌. నాలుగు రౌండల్లో కలిపి విజేత గా కొచ్చి టీమ్‌ను ప్రకటించారు. నిఖిల్‌ బోహ్రా, అలిస్టర్‌ యోంగ్‌ ఈ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

హైదరాబాద్‌ టీమ్‌ రెండో స్థానంలో..

కొద్ది పాయింట్ల తేడాతో హైదరాబాద్‌ టీమ్‌ రెండో స్థానంలో నిలిచింది. 385 పాయింట్లతో ఈ పోటీల్లో హైదరాబాద్‌ టీమ్‌కు రెండో స్థానం దక్కింది. ఆదివారం కావడంతో ఈ పోటీలను చూడడానికి ప్రేక్షకులు పోటెత్తారు. పలువురు సెలబ్రిటీలు పోటీలను ఉత్సాహంగా తిలకించారు . టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌చరణ్‌ , నాగచైతన్య పోటీలను తిలకించారు. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కూడా పోటీలను చూశారు. హైదరాబాద్‌లో ఇలాంటి పోటీలను నిర్వహించడంపై వాళ్లు హర్షం వ్యక్తం చేశారు.

282 పాయింట్లతో గోవా టీమ్‌కు మూడోస్థానం దక్కింది. చెన్నై టీమ్‌కు 279 పాయింట్లతో నాలుగో స్థానం దక్కింది. బెంగళూర్‌ టీమ్‌కు 147.5 పాయింట్లు లభించాయి. ఢిల్లీ టీమ్‌కు ఈ పోటీల్లో 141 పాయింట్లు లభించాయి. హుస్సేన్‌సాగర్‌ తీరంలో మొట్ట మొదటి సారిగా నిర్మించిన ఫార్ములా కార్‌ రేసింగ్‌ ట్రాక్‌లో ఈ పోటీలను నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..