Hyderabad: రాహుల్ జోడో యాత్రలో తోపులాట.. మాజీ మంత్రికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

రాహుల్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. దీంతో తొక్కిసలాట జరుగుతుంది. పోలీసులు కాస్త రఫ్‌గా వ్యవహరిస్తున్నారన్న అభియోగాలు కూడా ఉన్నాయి.

Hyderabad: రాహుల్ జోడో యాత్రలో తోపులాట.. మాజీ మంత్రికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Maharashtra’s former energy minister Nitin Raut
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 02, 2022 | 1:19 PM

నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. మార్నింగ్  గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది. నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పెద్ద ఎత్తన రాహుల్‌తో పాదం కలుపుతున్నారు.  జనంతో మమేకమవుతూ, వారి కష్టాలు వింటూ ముందుకు సాగుతున్నారు. కూకట్‌పల్లిలోని ఓ కేఫ్‌‌లో టీ తాగారు.  కరాటే విద్యార్ధులతో సరదాగా మాట్లాడారు. మదీనాగూడలో లంచ్ విరామం ఇచ్చారు. రాత్రికి ముత్తంగిలో రాహుల్‌గాంధీ బసచేయనున్నారు. కాగా రాహుల్‌ను కలిసేందుకు జనం పోటెత్తుతున్నారు. దీంతో తోపులాటలు కామన్ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ  ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్‌కి గాయం అయ్యింది.  రాహుల్‌తో కలిసి నడుస్తుండగా తోపులాట జరిగింది.  కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొనిరావడంతో.. రౌత్ కంటికి తీవ్ర గాయం అయ్యింది.  చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.

రాహుల్ సపర్యలకు చేతులెత్తి మొక్కిన మహిళ

పాదయాత్రలో  మానవత్వం చాటుకున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ ను కలిసే క్రమంలో ఓ వృద్ధురాలు కిందపడిపోయింది.  ఆమెను చేయి పట్టి లేపి నీళ్లు అందించారు రాహుల్.  ఆపై దగ్గరకి తీసుకుని ఆమెకు సపర్యలు చేశారు. ఆమెకు చెప్పులు తన చేతులతో అందించారు. రాహుల్ సపర్యలకు సదరు మహిళ చేతులెత్తి మొక్కింది.

బీజేపీ-టీఆర్‌ఎస్‌ ఒక్కటే : రాహుల్

బీజేపీ-టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని విమర్శించారు రాహుల్‌. పార్లమెంట్‌లో ఎన్నోసార్లు బీజేపీ-టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేశాయని ఆరోపించారు. ఎన్నో సందర్భాల్లో రెండుపార్టీలు ఒక్కటిగా ముందుకెళ్లాయన్నారు. ఎన్నికలు రాగానే రెండుపార్టీలూ డ్రామాలకు తెరదీస్తాయన్నారు రాహుల్‌. కేసీఆర్‌ ఫోన్‌ చేస్తే మోదీ వెంటనే స్పందిస్తారంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం  నెక్లెస్‌ రోడ్డు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కార్నర్‌ మీట్‌లో మాట్లాడారు రాహుల్‌గాంధీ.  శంషాబాద్‌ టు నెక్లెస్‌ రోడ్‌.. భారత్‌ జోడో యాత్ర పాతబస్తీ మీదుగా భారీ జనసందోహం నడుమ సాగింది. పాతబస్తీలో రాహుల్‌ పాదయాత్ర భారత్‌ జోడో యాత్రకే హైలైట్‌గా నిలిచింది. పాతబస్తీ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. చార్మినార్‌ పరిసరాలు కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పాదయాత్ర ఆద్యంతం సిటీలో రాహుల్‌కు ఘన స్వాగతం లభించింది. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర కార్నర్‌ మీటింగ్‌కు AICC అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే హాజరయ్యారు. కాంగ్రెస్‌ చీఫ్‌గా తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు ఖర్గే.

గతంలో రాజీవ్‌ సైతం చార్మినార్‌ నుంచే సద్భావన యాత్రను ప్రారంభించారు. గతాన్ని స్మరించుకుంటూ చార్మినార్‌ దగ్గర రాజీవ్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు రాహుల్‌గాంధీ. జాతీయ గీతం ఆలపించి ముందుకు కదిలారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు యాత్రలో పాల్గొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం