Bjp vs Trs: సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్..

Bjp vs Trs: నచ్చితే సరి.. లేదంటే.. రచ్చ రచ్చే.. వ్యక్తిగత దూషణలు, కార్టూన్లు, క్యారికేచర్లతో సోషల్ మీడియాలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది.

Bjp vs Trs: సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్..
Social Media
Follow us

|

Updated on: Sep 15, 2022 | 6:27 AM

Bjp vs Trs: నచ్చితే సరి.. లేదంటే.. రచ్చ రచ్చే.. వ్యక్తిగత దూషణలు, కార్టూన్లు, క్యారికేచర్లతో సోషల్ మీడియాలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. హైదరాబాద్‌లో కారు – కమలం మధ్య పోస్టులు – పోస్టర్ల వార్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేతల ప్రసంగాలు, వారి వ్యవహార శైలిపై ఏ చిన్న లూప్‌ హోల్ దొరికినా ఆడేసుకుంటుంటారు. దీని కోసం సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే జరుగుతోంది. ఫేస్‌బుక్, ట్విటర్ అన్న తేడా లేకుండా ఏం జరిగినా అవే ట్రెండింగ్‌. లేటెస్ట్‌గా తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఫేస్‌బుక్‌లో సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకరమైన ఫోటో పోస్ట్‌ చేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం మండిపడింది. చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడితే.. అటు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ల పక్కన.. కంటోన్మెంట్ యువత పేరుతో చెక్‌ పోస్ట్ దగ్గరున్న ప్రహారీలపై అంటించారు. ఐటీఐఆర్, మెడికల్ కళాశాలలు, ప్రాజెక్టులకు జాతీయ హోదాలాంటి 20 అంశాలను అందులో లేవనెత్తారు. వీటిని తెలంగాణ ప్రజలకు అందించి కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పాదయాత్రలతో ప్రజాసమస్యలు తీరవని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చేందుకే ఉందని కౌంటర్‌ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ గట్టుమీద పోస్టులు.. పోస్టర్లు కాకరేపుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..