Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime Hyderabad: ఢిల్లీ, యూపీ కేంద్రంగా జనాలను నిలువునా ముంచారు.. చివరికి హైదరాబాద్ పోలీసుల చేతిలో బుక్కయ్యారు..

Cyber Crime Hyderabad: బ్యాంక్ పేరుతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న ఘరానా ముఠా ఆట కట్టించారు హైరదాబాద్ పోలీసులు.

Cyber Crime Hyderabad: ఢిల్లీ, యూపీ కేంద్రంగా జనాలను నిలువునా ముంచారు.. చివరికి హైదరాబాద్ పోలీసుల చేతిలో బుక్కయ్యారు..
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 17, 2021 | 9:45 PM

Cyber Crime Hyderabad: బ్యాంక్ పేరుతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న ఘరానా ముఠా ఆట కట్టించారు హైరదాబాద్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శి, సైబర్ క్రైమ్ డీసీపీ లావణ్య ఆధ్వర్యంలో పోలీసులు.. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌ కేంద్రంగా ఆర్‌బిఎల్ బ్యాంక్ పేరిట దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొడుతున్న ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు. ఒకటి రెండు కాదు ఏకంగా 3 కోట్ల మేర జనాలను ముంచిన ఖిలాడి గ్యాంగ్ ని పట్టుకున్నారు. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌బిఎల్ బ్యాంక్ ఎంప్లాయ్ కస్టమర్స్ డేటా లీక్ చేయడం కొస మెరుపు. క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ డేటాను తీసుకున్న ఫేక్ కాల్ సెంటర్ నిర్వాహకులు.. కస్టమర్‌కి ఫోన్ చేసి ఇ క్రెడిట్ కార్డ్ పిన్ జనరేషన్ ప్రాసెస్ అంటూ వారి మొబైల్ ఫోన్‌కి వచ్చిన OTP తెలుసుకొని డబ్బును ఖాళీ చేసేవారు. కస్టమర్ పేరు, అడ్రస్, డేట్ అఫ్ బర్త్, ఫోన్ నెంబర్, క్రెడిట్ కార్డు నెంబర్ అన్నీ ఉండటంతో వారి పని సులువైంది.

అయితే కొల్లగొట్టే విధానంలో క్రిమినల్స్ టెక్నికల్ బ్రెయిన్ బాగా వాడారు. ఆన్‌లైన్ షాపింగ్ కోసం వీరే సొంతంగా 6 మర్చంట్ వెబ్ సైట్‌ని క్రియేట్ చేసి వాటికి సొంత బ్యాంక్ అకౌంట్‌ని జతచేసి కస్టమర్ క్రెడిట్ కార్డు ద్వారా ఆ వెబ్‌సైట్ లో షాపింగ్ చేస్తూ డబ్బులు కొల్లగొట్టడం వీరి స్టైల్. సైబరాబాద్ లిమిట్స్‌లో వచ్చిన ఓ కంప్లైంట్ ద్వారా ఇదంతా వెలుగు చూసింది. బ్యాంక్‌లో రిప్రజెంటేటివ్ అంటూ కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డ్ వివరాలు తీసుకొని ఓటీపీ సాయంతో రూ. 98,000 దోచేశారు. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదిలింది. ఢిల్లీ, ఉజ్జయిని కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాలో మొత్తం 23 మంది ఉండే.. 16 మందిని అరెస్టు చేశారు. అసలు నిందితుడితో పాటు మిగతావారు తప్పించుకున్నారు.

కాగా, వీరి మోసాలపై హైదరాబాద్‌లో 34 కేసులు నమోదవగా దేశవ్యాప్తంగా 166 కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో మరిన్ని కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొడుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పోలీసులు జరిపిన దాడుల్లో బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన కార్లు, 825 ఫేక్ ఆధార్, ఓటర్, పాన్ కార్డులు, వెయ్యికి పైగా సిమ్ కార్డులు, 34 మొబైల్ ఫోన్స్, చెక్ బుక్స్, పాస్ బుక్స్, స్వైపింగ్ మిషన్స్‌ని జప్తు చేశారు పోలీసులు. కాగా, ఈ వ్యవహారంపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. బ్యాంక్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీ డీటెయిల్స్ చెప్పకూడదని ప్రజలకు సూచించారు. సొంతంగా పిన్ నెంబర్లను క్రియేట్ చేసుకోవాలన్నారు. రివార్డ్ పాయింట్స్, క్రెడిట్ లిమిట్ పెంపు, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలాంటి విషయాల్లో బ్యాంక్ సూచనలు ఫాలో అవ్వాలని తెలిపారు.

Also read:

Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు