AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మేజర్. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్,

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..
Major
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2021 | 9:05 PM

Share

టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మేజర్. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మూడు భాషల్లో మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ నిర్వహించి తెరకెక్కించారు. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఇందులో 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా చూపించనున్నారు.

ఈ సినిమాలో శోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ఆడియో వరల్డ్ వైడ్ మ్యూజిక్ రైట్స్‏ను జీ మ్యూజిక్ కంపెనీ సొంతం చేసుకున్నట్లుగా ప్రకటించారు హీరో అడివి శేష్. ఈమేరకు మేజర్ నుంచి ఆసక్తికర పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

Also Read: Raviteja: రవితేజ ధమాకా నుంచి మరో అప్డేట్.. మాస్ మాహారాజా సరసన మరో హీరోయిన్..

Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్‏లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!

Suriya: నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్యూ.. మీ నమ్మకం, భరోసాకు కృతజ్ఞుడిని.. సూర్య ఆసక్తికర పోస్ట్..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..