Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్ ఫొటోషూట్.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..
జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకను ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంటారు. ఇక ప్రస్తుతం వివాహ వేడుకల్లో ఫొటోషూట్లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకను ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంటారు. ఇక ప్రస్తుతం వివాహ వేడుకల్లో ఫొటోషూట్లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే ముందే అందమైన ప్రదేశాలు, లొకేషన్లకు వెళ్లి వెరైటీ థీమ్‌లతో వినూత్నంగా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ వెడ్డింగ్ ఫొటోషూట్ వీడియా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇదెక్కడ జరిగిందో పూర్తి సమాచారం లేదు కానీ వీడియోలో భాగంగా పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన వధూవరులు ఓ అందమైన లొకేషన్‌లో నిల్చొని ఉంటారు. వీరితో పాటు ఓ ఫొటోగ్రాఫర్ కూడా ఉంటాడు. వధూవరులు రొమాంటిక్‌గా పోజులో ఉండగా, ఒక విమానం పొగలు కక్కుతూ వారివైపు వస్తుంది. వారి తలమీదుగా వేగంగా వెళ్లిపోతుంది. ఇదంతా ఫొటోషూట్‌లో భాగమేనని మనకు తెలిసిపోతుంది. అయితే ఈ దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో అందంగా బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ ఇది కాస్ట్‌లీ వెడ్డింగ్ ఫొటోషూట్’, ‘ఫొటో ఎలా ఉందో చూపించరా’, ‘ఫొటోలు బాగా రాలేకపోయినా పర్వాలేదు కానీ ఈ పొగ కారణంగా వధూవరులకు క్యాన్సర్ లాంటి వ్యాధుల రాకుండా ఉంటే చాలు’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
Also Read:
వాటే క్రియేటివిటీ బాస్ !! రోడ్ పై బైక్‌తో భార్యపిల్లల్ని ఉయ్యాలలూపుతూ !! వీడియో
Viral Video: పాముతో ఆటలు ఆడిన పిల్లి పిల్ల !! చివరకు ఏమైందంటే ?? వీడియో
Viral Video: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో