Hyderabad: చోరీల్లో వాళ్లది డిఫరెంట్ స్టైల్.. ఈ నయా ముఠా గురించి షాకింగ్ వివరాలు..!
Hyderabad: చోరీల్లో వాళ్లది డిఫరెంట్ స్టైల్.. చెడ్డీ గ్యాంగ్స్‌లా వాళ్లు అర్ధరాత్రి ఎటాక్స్ చేయరు. నమ్మకంగా పనిలో చేరతారు.
Hyderabad: చోరీల్లో వాళ్లది డిఫరెంట్ స్టైల్.. చెడ్డీ గ్యాంగ్స్‌లా వాళ్లు అర్ధరాత్రి ఎటాక్స్ చేయరు. నమ్మకంగా పనిలో చేరతారు. ఆ తర్వాత అదునుచూసి లూటీ చేస్తారు. హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ఆ గ్యాంగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయ్. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా చెలరేగిపోతున్నారు. లేటెస్ట్‌గా కూకట్‌పల్లిలో పంజా విసిరిన ఈ నేపాలీ కేటుగాళ్లు, కోటి రూపాయలకు పైగా క్యాష్ అండ్ ఆర్నమెంట్స్‌ను ఎత్తుకుపోయి కలకలం సృష్టించారు. కట్టుదిట్టమైన భద్రత, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలో బడా చోరీకి పాల్పడటంతో సవాలుగా తీసుకున్న పోలీసులు.. లక్నో మీదుగా నేపాల్ పారిపోతున్న ఈ గజదొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. భార్యాభర్తలైన చక్రి, సీతతోపాటు వాళ్లకు సహరించిన ఉపేందర్‌ను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి రూ. 28,90,000 నగదుతోపాటు 137 తులాల గోల్డ్‌ను రికవరీ చేశారు.
కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఈ చోరీ జరిగింది. ఓ ఫంక్షన్‌కు వెళ్లిన వడ్డేపల్లి దామోదర్‌రావు ఇంట్లో పక్కా ప్లాన్‌తో లూటీ చేసింది ఈ ముఠా. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కట్టుదిట్టమైన లాక్స్‌ను ఈజీగా ధ్వంసంచేసి దొరికినకాడికి దోచుకుపోయారు. ఆ ఇంటి వాచ్‌మెన్‌నే ఈ చోరీకి సూత్రధారని గుర్తించి మూడ్రోజులు తిరక్కుండానే నేపాలీ ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. నిందితుల దగ్గర్నుంచి కోటి రూపాయల విలువైన క్యాష్ అండ్ ఆర్నమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌మెన్స్ గానో, సెక్యూరిటీ గార్డ్స్ గానో, పని మనుషులుగానో పనిలో చేరుతోన్న ఈ నేపాలీ గ్యాంగ్స్, యజమానికి నమ్మకం కుదిరాక, అదునుచూసి ప్లాన్‌ను ఇంప్లిమెంట్స్ చేస్తున్నారు. అన్నం పెడుతోన్న ఇంటికే కన్నంవేస్తూ, తిన్నంటి వాసాలు లెక్కపెడుతోన్న ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..