హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రొఫెసర్ ఆత్మహత్య..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ రిషీ భరద్వాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రొఫెసర్ ఆత్మహత్య..
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 29, 2020 | 9:09 PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ రిషీ భరద్వాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లోని తన క్వార్టర్‌లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్యాన్‌కు వేలాడుతున్న భరద్వాజ్ మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రిషీ భరద్వాజ్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెడికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.