AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad Bypoll: బండి సంజయ్ ఏం చేశారు?.. ఈటల ఏం చేస్తారు? : బాల్క సుమన్ సూటి ప్రశ్న

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ వెలువడిన నేపథ్యంలో అక్కడ ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది.

Huzurabad Bypoll: బండి సంజయ్ ఏం చేశారు?.. ఈటల ఏం చేస్తారు? : బాల్క సుమన్ సూటి ప్రశ్న
Balka Suman
Shiva Prajapati
|

Updated on: Oct 02, 2021 | 4:23 PM

Share

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ వెలువడిన నేపథ్యంలో అక్కడ ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కమలాపూర్ మండలం గుండెడు గ్రామంలో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈటల రాజేందర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ రాజీనామాకు కారణం ఏంటని ప్రశ్నించారు. ఎందుకు రాజీనామా చేశాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కోసం రాజీనామా చేశారా..? రైతుల జీవితాలు నాశనం చేసే నల్ల చట్టాల్లో మార్పుల కోసం రాజీనామా చేశారా..? ఎస్సీ, బీసీల భూములు అక్రమంగా కబ్జా చేశారు కాబట్టే రాజీనామా చేశాడు. పేద ప్రజలను కొట్టి, బలవంతం, దౌర్జన్యం చేసి బెదిరిస్తే ముఖ్యమంత్రి ఆయన్ను తొలగించారు. ఇప్పుడు తన భూములు, ఆస్తులను కాపాడుకోడానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మధ్యంతర ఎన్నికలకు దారి తీశారు.’’ అని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ప్రజలకు తాను చేసిన అన్యాయాన్ని మర్చిపోయి ఈటల ఎన్నికల ప్రచారం చేస్తున్నారని నిప్పుల చెరిగారు. హుజురాబాద్‌లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు కానీ హైదరాబాద్ లో మాత్రం పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓటేస్తే బండి సంజయ్ ఎం చేశారో? ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

Also read:

MAA Elections 2021: రోజుకో ట్విస్ట్.. ఉత్కంఠగా మారిన ‘మా’ ఎన్నికలు.. వేడెక్కిన రాజకీయం

Huzurabad By Election: హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటర్ల సైలెన్స్‌ ఎవ‌రి పుట్టి ముంచుతుందో.. ప్రధాన పార్టీల్లో మొదలై టెన్షన్!

Women: వయస్సు పెరుగుతున్న కొద్దీ మహిళలకు ఈ 5 విటమిన్లు కచ్చితంగా అవసరం..!