Huzurabad By Election: హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటర్ల సైలెన్స్‌ ఎవ‌రి పుట్టి ముంచుతుందో.. ప్రధాన పార్టీల్లో మొదలై టెన్షన్!

అన్ని స‌భ‌ల‌కు అటెండ్ అవుతున్నారు.. అందరి ర్యాలీల‌కు వెళుతున్నారు.. ఎ నాయ‌కుడొచ్చినా ఓటు మీకే అంటున్నారు. కానీ అస‌లు మ‌నోగ‌తం మాత్రం బ‌య‌ట‌పెట్ట‌ట్లేదు. ప‌బ్లిక్ ప‌ల్స్ దొర‌క్క హుజురాబాద్‌లో ప‌రేష‌న్ అవుతున్నాయి ప్రధాన పార్టీలు.

Huzurabad By Election: హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటర్ల సైలెన్స్‌ ఎవ‌రి పుట్టి ముంచుతుందో.. ప్రధాన పార్టీల్లో మొదలై టెన్షన్!
Huzurabad By Election
Follow us

|

Updated on: Oct 02, 2021 | 4:05 PM

Political Parties tension: అన్ని స‌భ‌ల‌కు అటెండ్ అవుతున్నారు.. అందరి ర్యాలీల‌కు వెళుతున్నారు.. ఎ నాయ‌కుడొచ్చినా ఓటు మీకే అంటున్నారు. కానీ అస‌లు మ‌నోగ‌తం మాత్రం బ‌య‌ట‌పెట్ట‌ట్లేదు. ప‌బ్లిక్ ప‌ల్స్ దొర‌క్క హుజురాబాద్‌లో ప‌రేష‌న్ అవుతున్నాయి ప్రధాన పార్టీలు. దాదాపు రెండు నెల‌లుగా నియోజకవర్గంలో టీఅర్ఎస్ , బీజెపీ నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నా.. ఒట‌ర్ల నాడి మాత్రం పట్టలేక‌పోతున్నారు. ఇంట‌లీజెన్స్‌, సర్వే సంస్థలు కూడా అక్కడి ట్రెండ్స్ చెప్పలేక‌పోతున్నాయి.

ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందే దాదాపుగా ప‌బ్లిక్ ప‌ల్స్ తెలిసిపోతుంది. ఇక, ఎల‌క్షన్స్‌కి చాలా స‌మ‌యం ఉంటే సర్వే సంస్థల ద్వారానో, ఇంట‌లిజెన్స్ స‌మాచారం ద్వారానో ప‌ర్సంటేజ్‌ల రూపంలో ఓట్లు ఎటు వెళ్తున్నాయో తెలిసిపోతుంది. కానీ ఇంత స‌మ‌యం దొరికినా హుజురాబాద్ ప‌ల్స్ మాత్రం అంచుచిక్కడంలేదు. రాజీనామా చేసిన రోజు నుంచి ప్రజ‌ల్లోనే ఉన్నారు మాజీ మంత్రి ఈటల‌ రాజేందర్. పాద‌యాత్రలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం పేరుతో నియోజ‌క‌వ‌ర్గం మొత్తం సుడిగాలి ప‌ర్యటన చేస్తున్నారు. అటు.. అధికార‌పార్టీ టీఅర్ఎస్ కూడా మెద‌టి రోజు నుంచే భారీగా లీడ‌ర్లను రంగంలోకి దింపింది. మండ‌లానికి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున అక్కడ భాద్యతలు అప్పగించింది. మంత్రి హ‌రీష్‌రావు కూడా పూర్తి స్థాయిలో అక్కడే మ‌కాం వేశారు. జిల్లా మంత్రులు గంగుల, కొప్పుల కూడా వ‌రుస ప‌ర్యట‌న‌లు చేస్తున్నారు. అటు బీజేపీ మీటింగ్ పెట్టినా, ఇటు టీఅర్ఎస్ ర్యాలీలు నిర్వహించినా నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు హ‌జ‌ర‌వుతున్నారు. కుల సంఘాల స‌మావేశాల‌కు రెండు పార్టీల నేత‌ల‌ను అహ్వానిస్తున్నారు. గ్రామాల‌కు వ‌చ్చే రెండుపార్టీల అభ్యర్థుల‌కు హ‌ర‌తి ప‌డుతున్నారు. ఇదంతా కామ‌నే అనుకున్నా.. ఈ రెండు పార్టీల స‌మావేశాల్లో క‌నిపిస్తుంది మాత్రం అదే ఓట‌ర్లు అవ‌డం చ‌ర్చగా మారింది.

మేము గెలుస్తామంటే మేమే గెలుస్తామ‌ని భారీ ప్రక‌ట‌న‌లు చేస్తున్న రెండు పార్టీల నాయ‌కులు లోలోప‌ల మాత్రం జంకుతున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభ‌వం, నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కున్న ప‌ట్టు వీటితో పాటు లీడ‌ర్లు పోయినా క్యాడ‌ర్ నాతోనే ఉన్నారంటు బలంగా న‌మ్ముతున్నారు ఈటల. ప్రభుత్వం ప‌థ‌కాలు, ద‌ళిత బందు, కేసీఅర్ బ్రాండ్ నేమ్‌తో పాటు గ్రామ‌స్థాయి నాయ‌క‌త్వంమంతా టీఅర్ఎస్ వైపే ఉంది కాబ‌ట్టి గెలుపు మాదే అంటుంది టీఅర్ఎస్‌. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి ఎవ‌రికి అంతుచిక్కని అంశంగా మారింది. చాలా తెలివిగా ఎవ‌రికి చెడు అవ‌కుండా వ్యవ‌హిస్తున్నారు ఓట‌ర్లు.. స‌ర్వే సంస్థల‌కు సైలెంట్‌గానే స‌మాధానం చెబుతున్నారు.

పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు రెండు ఇటు రాష్ట్రంలో, అటు కేంధ్రంలో అధికారంలో ఉన్నవే.. స్టేట్ , సెంట్రల్ ఇంజ‌లిజెన్స్ ఇద్దరు స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు ర‌క‌ర‌కాలుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చినా ఎక్కడా క్లారిటీ లేదు. అటు స‌ర్వేలు పై అధార‌ప‌డి ఎన్నిక‌ల‌ను నిర్వహించే టీఅర్ఎస్ పార్టీకి కూడా ఇదో అంతుచిక్కని వ్వవ‌హ‌రంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో సైలెన్స్‌ ఎవ‌రి పుట్టి ముంచుతుందో అని రాజ‌కీయ పార్టీల్లో టెన్షన్ మెద‌లైంది.

Read Also…  Pawan Kalyan: తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. తగ్గేది లేదు.. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదుః పవన్

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.