Nallamala Forest: ప్రతాపరుద్రుని కోటలో అసలేం జరుగుతోంది?.. జోరుగా చర్చించుకుంటున్న నల్లమల గ్రామాల ప్రజలు..

14 వ శతాబ్దానికి చెందిన కట్టడం.. కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి నల్లమల అడవిలో దాదాపు 300 కిలోమీటర్ల పోడవున ఉన్న ప్రతాపరుద్రుని కోటలో..

Nallamala Forest: ప్రతాపరుద్రుని కోటలో అసలేం జరుగుతోంది?.. జోరుగా చర్చించుకుంటున్న నల్లమల గ్రామాల ప్రజలు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 24, 2021 | 3:52 PM

Nallamala Forest: నల్లమల అడవి అంటేనే నిధులు, నిక్షేపాలకు నిలయం. అలాంటి అడవిని టార్గెట్ చేశారు కొందరు వ్యక్తులు. టూరిజం పేరుతో పేరుతో గుప్తనిధుల వేట సాగిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్‌లో గుప్తనిధుల వేటను సాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే..

దక్షిణ తెలంగాణా లోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలో నల్లమల అడవిలో కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన కోట ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి నల్లమల అడవిలో దాదాపు 300 కిలోమీటర్ల పోడవున ప్రతాపరుద్రుని కోట ఉంది. ఇది దాదాపు14 వ శతాబ్దానికి చెందిన పురాతనమైన కట్టడం. రుద్రమదేవి మనువడు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ కోటలోకి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా అధికారులు రోడ్డు మార్గం కూడా నిర్మించారు. అంతేకాదు.. టూరిజం పేరుతో స్థానిక అధికారులు కోట మరమ్మతులకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ టూరిజం అభివృద్ధి ముసుగులో పలువురు అధికారులు గుప్తనిధుల తవ్వకాలకు తెరలేపారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, అంత ఈజీగా అటవీశాఖ అనుమతులు లంభించవు. మేతకోసం పశువులను అడవిలోకి తీసుకెళ్తేనే రైతులపై అటవీశాఖ అధికారులు కేసులు పెడతారు. స్థానికులు వంట చేయడానికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్లినా వదిలిపెట్టకుండా భారీ జరిమానాలు విధిస్తుంటారు. కానీ, సామాన్యుల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించే అధికారులు.. అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడుతున్న వారిపట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో అటవీశాఖ అధికారులు ప్రతాపరుద్రుని కోటపై ఉన్న గుప్తనిధులను స్వాహా చేసే కుట్రచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో అధికారులే.. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని స్థానిక ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. టూరిజం అభివృద్ధి పనులు చేస్తున్నారా? లేక నిధులు, నిక్షేపాలను వెలికి తీసే పనిలో పడ్డారా? అనే సందేహాలను స్థానిక గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నల్లమల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read:

గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్య, చంపి మృతదేహాన్ని కాలువలో పడేసిన తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డి

పాలమూరు జిల్లాలో దారుణం..! చిన్న పిల్లాడని చూడకుండా కడతేర్చారు కర్కోటకులు.. కిడ్నాప్ గురైన బాలుడి దారుణ హత్య..!