డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, తెలంగాణ దేశానికే ఆదర్శవంతమయిందని వ్యాఖ్య

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Feb 24, 2021 | 4:24 PM

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మదేవేదంర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గాజులగూడెం,..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, తెలంగాణ దేశానికే ఆదర్శవంతమయిందని వ్యాఖ్య

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మదేవేదంర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గాజులగూడెం, ఛత్రియల్ గ్రామాల్లో రెండు పడకగదుల ఇళ్లను లబ్దిదారులకు అందించారు. ‘కరోనా లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గింది..అందుకే రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు లేటయ్యాయి’ అని ఈ సందర్భంగా హరీశ్ రావు అన్నారు. కరోనా మహమ్మారి పుణ్యమాని రైతుల రుణమాఫీ, సొంత జాగలో ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం లాంటివి ఆగిపోయాయని మంత్రి వివరణ ఇచ్చారు. వీటిని ఉగాది వరకు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వలు రైతులకు సాగు నీరు ఇవ్వడం కోసం నీటి తీరువ పేరిట రైతుల నుండి డబ్బులు వసూలు చేశారని చెప్పిన హరీశ్ రావు, ఈరోజు ఆ తీరువను రద్దు చేసిన పార్టీ టీఆర్ఎస్ అని హరీశ్ రావు అన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో ఉన్న ఘానపురం ఆయకట్టు ఎత్తు పెంచుతామని, త్వరలో ఇక్కడికి కాళేశ్వరం నీరు వస్తాయని, తద్వారా 34 వేల ఎకరాల్లో సాగు వీలవుతుందని హరీశ్ రావు వెల్లడించారు. ఈ 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేయలేదన్న ఆయన, తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి ఆదర్శం అయ్యిందని స్పష్టం చేశారు. ‘భారతదేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుంది.. దీనికి మనం గర్వపడాలి’ అని హరీశ్ రావు అన్నారు.

Read also :

గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్య, చంపి మృతదేహాన్ని కాలువలో పడేసిన తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu