AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

watch: వామ్మో.. ఇదెక్కడి వెరైటీ పైథాన్‌ రా బాబు.. దగ్గరకెళ్లాలంటేనే వణిపోతున్న స్థానిక జనాలు

Python spotted: ఇటీవల కాలంలో చెట్లను నరికేయడంతో అడవిలో ఉండాల్సిన వణ్యప్రాణులు సర్పాలన్ని జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన వాటిని చూసి జనాలు భయాందోళనకు గురై వాటికి కొట్టి చంపడమో లేదా.. అటవీశాఖ అధికారుల సహాయంతో తిరిగి అడవితో వదిలేయడమో జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. అనుకోకుండా జనాల్లోకి వచ్చిన ఓ భారీ కొండచిలువను గమనించిన జనాలు అటవీశాఖ అధికారుల సహాయంతో దాన్ని సమీప అటవీప్రాంతంలో వదిలేశారు.

watch: వామ్మో.. ఇదెక్కడి వెరైటీ పైథాన్‌ రా బాబు.. దగ్గరకెళ్లాలంటేనే వణిపోతున్న స్థానిక జనాలు
Python Rescue
G Sampath Kumar
| Edited By: Anand T|

Updated on: Oct 23, 2025 | 10:42 AM

Share

ఇటీవల కాలంలో చెట్లను నరికేయడంతో అడవిలో ఉండాల్సిన వణ్యప్రాణులు సర్పాలన్ని జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన వాటిని చూసి జనాలు భయాందోళనకు గురై వాటికి కొట్టి చంపడమో లేదా.. అటవీశాఖ అధికారుల సహాయంతో తిరిగి అడవితో వదిలేయడమో జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం వద్ద ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. మొదట దాన్ని చూసిన జనాలు కర్రేమో అనుకున్నారు. కానీ అది కదులుతుండడంతో దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. దాంతో భయాందోళనకు గురై దాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.

కానీ అది ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. కొండ చిలువ ఉందనే సమాచారంతో దాన్ని చూసేందుకు భారీగా జనాలు గుమిగూడారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు హుటాహుటీన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది వారికి చిక్కకుండా చాలా సేపు ఇంబ్బంది పెట్టింది. దాదాపు అరగంట పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు దాన్ని పట్టుకున్నారు.

తర్వాత దాన్ని అక్కడి నుంచి ఒక సంచిలో తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో స్థానికులంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎప్పుడూ జనాలు తిరుగుతూ ఉంటారు, ఇక్కడికి ఇంత పెద్ద కొండ చిలువ ఎలా వచ్చిందో అనే ఆయోమయంలో పడిపోయారు జనాలు. ఈ ప్రాంతంలో ఇంకా ఏమైనా కొండచిలువలు ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం గాలించాలని అటవీశాఖ అధికారులను కోరారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..