AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండురోజుల పసి కందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఇంతలోనే తల్లి అప్రమత్తం కావడంతో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది‌.

అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..
Phc Gudihathinur Adilabad
Naresh Gollana
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 22, 2025 | 12:53 PM

Share

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండురోజుల పసి కందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఇంతలోనే తల్లి అప్రమత్తం కావడంతో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది‌. ఫ్యాన్ ఊడిపడే సమయంలో బాలింత తన బిడ్డను రెప్పపాటులో ఒళ్లోకి తీసుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది రెండు రోజుల పసికందు.. అనంతరం అప్రమత్తమైన గుడిహథ్నూర్ ప్రాథమిక ఆస్పత్రి సిబ్బంది పసికందును, బాలింత తల్లిను 108 అంబులెన్స్ లో అత్యవసర చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. తల్లి బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారని రిమ్స్ వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు‌.

వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ పాయల్ పురిటి నొప్పులతో ఇబ్బంది పడటంతో భర్త జాదవ్ కైలాష్ గుడిహథ్నూర్ ప్రాథమిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొన్ని గంటల్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది పాయల్. తల్లిబిడ్డలిద్దరు జనరల్ వార్డ్ లో చికిత్స పొందుతుండగా.. ఈరోజు‌ ఉదయం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వారి బెడ్ పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది.

ఈ హఠాత్పరిణామానికి భయభ్రాంతులకు గురైన తల్లి పాయల్ అంతే వేగంగా తన బిడ్డను పక్కకు లాగడంతో ఫ్యాన్ చివరి భాగం వీపుపై పడింది‌. దీంతో అలర్ట్ అయిన గుడిహత్నూర్ ఆస్పత్రి సిబ్బంది తల్లిబిడ్డలనిద్దరిని మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు.

ప్రస్తుతం తల్లిబిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘోరం జరుగుంటే ఎవరు బాధ్యత వహించే వారని నిలదీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రిలో సౌకర్యాలపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..